HomeతెలంగాణKaleshwaram | కాళేశ్వరం నిజంగా ఎనిమిదో వింతే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

Kaleshwaram | కాళేశ్వరం నిజంగా ఎనిమిదో వింతే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్ట్​తో Kaleshwaram  project పాటు అన్నారం annaram, సుందిళ్ల sundilla బ్యారెజీలు కూడా ఉండవని ఎన్​డీఎస్​ఏ ndsa నివేదిక ఇచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి komatireddy అన్నారు. తమకు ఆ విషయం ఆరు నెలల క్రితమే తెలుసని.. అందుకే ఆ బ్యారెజీల్లో నీరు నిల్వ ఉంచలేదన్నారు. ఆ రిపోర్టు తాజాగా బయటకు రావడంతో అవగాహన లేకుండా కేటీఆర్ ktr​ మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి komatireddy విమర్శించారు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం పండించామని మంత్రి తెలిపారు.

డిజైన్​ మార్చడం, నాణ్యతాలోపంతోనే కాళేశ్వరం కూలిపోయిందని కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్​ kcr స్వయంగా ఇంజినీర్​ అవతారం ఎత్తి డిజైన్​ గీశానని చెప్పుకున్నాడని గుర్తు చేశారు. కేసీఆర్​ అన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్​ కట్టిన మూడేళ్లకే కూలడం నిజంగా ఎనిమిదో వింతేనని మంత్రి ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు చిన్నగా కుంగింది అన్న బీఆర్​ఎస్​ నాయకులు ఇప్పుడు అన్నారం, సుందిళ్ల బ్యారెజీలు కూడా ఉండవని ఎన్​డీఎస్​ఏ నివేదికపై సమాధానం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.