- Advertisement -
HomeతెలంగాణKaleshwaram | కాళేశ్వరం అవినీతి తిమింగళం హరిరామ్‌ అరెస్టు

Kaleshwaram | కాళేశ్వరం అవినీతి తిమింగళం హరిరామ్‌ అరెస్టు

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటి పారుదల శాఖ గజ్వేల్‌ ఈఎన్‌సీ హరిరామ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. భారీగా అక్రమాస్తులు కూడగట్టారనే అభియోగాల నేపథ్యంలో శనివారం సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు.. గుర్తించిన అక్రమాస్తుల విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

హరిరామ్‌కు షేక్‌పేట, కొండాపూర్‌లో రెండు విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్‌లో మూడు ఫ్లాట్లు, ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh రాజధాని capital  అమరావతి Amaravati లో వాణిజ్య స్థలం, సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ ల్యాండ్​, పటాన్‌చెరులో 20 గుంటల స్థలం, శ్రీనగర్‌ కాలనీలో రెండు ఇండిపెండెంట్‌ ఇళ్లు, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల్లో ఫామ్‌హౌస్‌, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, మిర్యాలగూడలో ఖాళీ జాగా, రెండు కార్లు, బోలెడన్ని స్వర్ణాభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News