అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MP Laxman | బీఆర్ఎస్లో చోటు చేసుకున్న పరిణామాలపై బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. కాళేశ్వరం కూలినట్లే.. బీఆర్‌ఎస్ కూలిందని ఆయన వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం మూడు పిల్లర్లు కుంగినట్లు.. బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) మూడు ముక్కలైందని ఎంపీ లక్ష్మణ్ ఎద్దేశా చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) అవినీతి విషయంలో సీబీఐ దర్యాప్తు జరపాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. అయితే 22 నెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి ఎం చేశారని ప్రశ్నించారు.
MP Laxman | నివేదికపై అసంతృప్తి
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని గతంలో కాగ్ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కానీ పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission) నివేదికలో క్రిమినల్ రిఫరెన్స్ లేవని, నాయకులు, అధికారులు, కాంట్రాక్టుల పాత్ర ఏమిటో స్పష్టంగా చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు.
MP Laxman | ఆస్తులు కొల్లగొట్టారు
ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సోమవారం మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతికి హరీశ్‌రావు, సంతోష్‌రావు కారణం అని వ్యాఖ్యానించారు. దీనిపై లక్ష్మణ్ స్పందించారు. వారిద్దరు అవినీతి ఆనకొండలని కవిత చెప్పారన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టిందని విమర్శించారు. కేసీఆర్(KCR)ను బలిపశువు చేశారని కవిత అనడంపై ఆయన స్పందిస్తూ.. అవినీతిలో కేసీఆర్ పాత్ర ఉందనుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ(CBI Investigation) జరిపి నిందితులను శిక్షించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.