Homeతాజావార్తలుCM Revanth Reddy | కాళేశ్వరం బ్యారేజీలకు మరమ్మతులు చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు

CM Revanth Reddy | కాళేశ్వరం బ్యారేజీలకు మరమ్మతులు చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్ట్​లపై సీఎం రేవంత్​రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగంగా నిర్మించిన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఇందుకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలన్నారు.

రాష్ట్రంలో ప్రాజెక్ట్​లపై మంగళవారం సీఎం మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి (Minister Uttam Kumar Reddy) తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సమగ్ర ఆనకట్ట భద్రతా మూల్యాంకనం పురోగతి తక్కువగా ఉందని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ (Minister C.R. Patil) ఇటీవల సీఎంకు లేఖ రాశారు. ఈ క్రమంలో రేవంత్​రెడ్డి సమీక్ష చేపట్టారు. నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదికలను తయారు చేయాలని ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

CM Revanth Reddy | 80 టీఎంసీలు తరలించేలా..

తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించడానికి వీలుగా ప్రాజెక్టుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టుపై సమీక్షలో చర్చించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించే విధంగా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ఇందుకు పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లేందుకు వీలుగా అంచనాలను తయారు చేయాలని ఆదేశించారు.సుందిళ్ల బ్యారేజీ (Sundilla Barrage)కి మరమ్మతులు చేసి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.