అక్షరటుడే, డిచ్పల్లి: Kaleshwaram | కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు (CBI inquiry) కాంగ్రెస్ కుట్రలో భాగమేనని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Former MLA BajiReddy Govardhan) పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని ఖండిస్తూ ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి.
డిచ్పల్లి – నిజామాబాద్ (Dichpally) ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిపాలన చేతగాని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు అన్నపూర్ణగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ (Bajireddy jagan), బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, గడ్కోల్ భూషణ్ రెడ్డి, పద్మారావు, మహేందర్ యాదవ్, తొర్లికొండ రాజు తదితరులు పాల్గొన్నారు.
Kaleshwaram | కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ కక్షసాధిస్తోంది..
అక్షరటుడే, ఇందూరు: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ వెనుక కాంగ్రెస్ కుట్ర దాగి ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజు (Sirpa Raju), నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి (Former Nuda Chairman Prabhakar Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే కాళేశ్వరంపై నిందలు వేస్తోందన్నారు.
ఎన్నికలు ఉన్నాయంటే చాలు కాళేశ్వరాన్ని ముందుపెట్టి ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు. సీబీఐ దర్యాప్తు వెనుక సీఎంలు రేవంత్, చంద్రబాబుల అస్త్రం ఉందని తెలుస్తోందన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు అభివృద్ధి గురించి పక్కన పెట్టి, కేసీఆర్ తప్ప వేరే మాట లేకుండా పోయిందన్నారు.
కేసీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ప్రతి ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇలాంటి డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి (CM Revanth reddy) ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారన్నారు. కేసీఆర్‌పై లేనిపోని నిందలు వేసి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కదోవ పట్టించి ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చూస్తున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు సత్య ప్రకాష్, సుజిత్ సింగ్ ఠాకూర్, నవీద్ ఇక్బాల్, గాండ్ల లింగం, రవి, సదానంద్, రాజు, మహేందర్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
Kaleshwaram | వేల్పూర్ క్రాస్‌రోడ్‌లో..
అక్షరటుడే, భీమ్‌గల్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై.. కేసీఆర్ (KCR), హరీష్‌రావుపై (Harish Rao) బురద జల్లుతూ సీబీఐ (CBI) ఎంక్వయిరీ పేరుతో కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. వేల్పూర్ (Velpur) క్రాస్‌రోడ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాళేశ్వరం తెలంగాణ రైతులకు వరప్రదాయిని అని పేర్కొన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల కుట్రలను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై భైఠాయించారు. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సైలు సందీప్ సంజీవ్ రాము పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.