ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Kaleshwaram | కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కాంగ్రెస్​ కుట్రలో భాగమే..

    Kaleshwaram | కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కాంగ్రెస్​ కుట్రలో భాగమే..

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Kaleshwaram | కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు (CBI inquiry) కాంగ్రెస్​ కుట్రలో భాగమేనని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Former MLA BajiReddy Govardhan)​ పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్​ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని ఖండిస్తూ ఆయన ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ శ్రేణులు నిరసన తెలిపాయి.

    డిచ్​పల్లి – నిజామాబాద్ (Dichpally)​ ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిపాలన చేతగాని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్​పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు అన్నపూర్ణగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్​ యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ (Bajireddy jagan), బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, గడ్కోల్ భూషణ్ రెడ్డి, పద్మారావు, మహేందర్ యాదవ్, తొర్లికొండ రాజు తదితరులు పాల్గొన్నారు.​

    Kaleshwaram | కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్​ కక్షసాధిస్తోంది..

    అక్షరటుడే, ఇందూరు: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ వెనుక కాంగ్రెస్ కుట్ర దాగి ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజు (Sirpa Raju), నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి (Former Nuda Chairman Prabhakar Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే కాళేశ్వరంపై నిందలు వేస్తోందన్నారు.

    ఎన్నికలు ఉన్నాయంటే చాలు కాళేశ్వరాన్ని ముందుపెట్టి ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు. సీబీఐ దర్యాప్తు వెనుక సీఎంలు రేవంత్, చంద్రబాబుల అస్త్రం ఉందని తెలుస్తోందన్నారు. కాంగ్రెస్​కు తెలంగాణ ప్రజలు అభివృద్ధి గురించి పక్కన పెట్టి, కేసీఆర్ తప్ప వేరే మాట లేకుండా పోయిందన్నారు.

    కేసీఆర్​ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ప్రతి ఎన్నికల ముందు కాంగ్రెస్​ ఇలాంటి డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. రేవంత్​రెడ్డి (CM Revanth reddy) ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారన్నారు. కేసీఆర్​పై లేనిపోని నిందలు వేసి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కదోవ పట్టించి ఆంధ్రప్రదేశ్​కు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చూస్తున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు సత్య ప్రకాష్, సుజిత్ సింగ్ ఠాకూర్, నవీద్ ఇక్బాల్, గాండ్ల లింగం, రవి, సదానంద్, రాజు, మహేందర్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

    Kaleshwaram | వేల్పూర్​ క్రాస్​రోడ్​లో..

    అక్షరటుడే, భీమ్​గల్: కాళేశ్వరం ప్రాజెక్ట్​పై.. కేసీఆర్ (KCR), హరీష్​రావుపై (Harish Rao) బురద జల్లుతూ సీబీఐ (CBI) ఎంక్వయిరీ పేరుతో కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీఆర్​ఎస్​ నాయకులు పేర్కొన్నారు. వేల్పూర్ (Velpur) క్రాస్​రోడ్ వద్ద బీఆర్​ఎస్​ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాళేశ్వరం తెలంగాణ రైతులకు వరప్రదాయిని అని పేర్కొన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల కుట్రలను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు.

    ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై భైఠాయించారు. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​కు తరలించారు. రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సైలు సందీప్ సంజీవ్ రాము పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...