అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | మాదకద్రవ్యాల వైపు యువత మొగ్గుచూపకుండా ప్రజలను పోలీసు కళా బృందాలు (kala brundam) చైతన్య పరుస్తున్నాయని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పరిధిలలో గ్రామాలకు కళాబృందం సభ్యులు వెళ్లి చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
CP Sai Chaitanya | సైబర్ నేరాలు.. డ్రగ్స్ నిరోధంపై అవగాహన..
పోలీస్ సిబ్బంది కళాబృందాలుగా ఏర్పడి ప్రతిపల్లెలో సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం (Drugs), మహిళల రక్షణ, మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. కొంతమంది స్వార్థపరులు అమాయకుల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారని.. ప్రజల్లో అవగాహన కలిగినప్పుడే సైబర్ నేరాలు తగ్గుతాయన్నారు.
CP Sai Chaitanya | ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు..
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పోలీసు కళాబృందం సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. స్వచ్ఛందంగా పోలీసు వ్యవస్థలోని సిబ్బంది ముందుకొచ్చి పల్లెపల్లెకు వెళ్తున్నారని.. ప్రజలకు స్వచ్ఛందంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పాటలు, నాటకాల రూపంలో చైతన్యం కలిగిస్తున్నారన్నారు.
CP Sai Chaitanya | ట్రాఫిక్‌పై సైతం అవగాహన..
రోడ్డు భద్రతపై సైతం కళాబృందం సభ్యులు అవగాహన కల్పిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెబుతున్నారన్నారు. మహిళల రక్షణ కోసం ప్రస్తుతం కొత్త చట్టాలపై మహిళలకు అవగాహన, వారి రక్షణే ప్రధాన ధ్వేయమన్నారు. మహిళలు ఏవైనా అసౌకర్యానికి గురైనప్పుడు షీటీం (She Team) 87126 59795 లేదా డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేయించుకోవచ్చన్నారు. 2025 మార్చి నుంచి సెప్టెంబర్ 2025 వరకు 117 కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కళా బృందానికి రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉన్నారని పేర్కొన్నారు. ఏఆర్ ఎస్సై శ్రీనివాస్, కానిస్టేబుళ్లు శేఖర్, విక్రమ్, మహిళా హోంగార్డు సీత, అవుట్సోర్సింగ్ సిబ్బంది బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.