అక్షరటుడే, వెబ్‌డెస్క్: JEE Advanced results | జేఈఈ అడ్వాన్స్ మెయిన్స్ ఫలితాల్లో కాకతీయ విద్యార్థులు (Kakatiya students) ప్రభంజనం సృష్టించారు. తొలి ప్రయత్నంలో ఐదుగురు విద్యార్థులు సత్తా చాటారు.
ఎలాంటి లాంగ్‌టర్మ్ కోచింగ్ (Without long-term coaching) తీసుకోకుండానే ఉత్తమ ప్రతిభ కనబర్చారు. కళాశాలలో ఇచ్చిన శిక్షణతో జాతీయ ప్రవేశ పరీక్షలో మెరిశారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు కాకతీయ విద్యాసంస్థల ఛైర్పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి (Kakatiya Educational Institutions Chairperson CH Vijayalakshmi) తెలిపారు. సాయి సర్వజిత్ (347), ఎల్.శివ (1299), ఎం.సంకీర్త్(6383), జి.వేదాక్షర్ (9524) ర్యాంకులు సాధించగా.. వారిని అభినందించారు.
అలాగే IIT/NEET/EAMCET ACADEMIC డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు (IITIAN) మాట్లాడుతూ.. JEE ADVANCE 2025 ఫలితాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తమ విద్యార్థులు నిజామాబాద్ స్థాయిలోనే కాకుండా, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటారని పేర్కొన్నారు.
కాకతీయ డైరెక్టర్ సీహెచ్ తేజస్విని (Kakatiya Director CH Tejaswini) మాట్లాడుతూ.. ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కాకతీయ IIT, NEET, EAMCET Academy లోని ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, యాజమాన్య నిరంతర పర్యవేక్షణ, వారాంతపు పరీక్షలే ముఖ్య కారణమన్నారు. వివిధ కేటగిరీలలో ఆల్ ఇండియా ర్యాంకులు, ఇంటర్‌తో పాటు నేరుగా తొలి ప్రయత్నంలోనే సాధించినవేనని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాకతీయ విద్యాసంస్థల ప్రిన్సిపల్ సందీప్ కులకర్ణి (Kakatiya Educational Institutions Principal Sandeep Kulkarni), వైస్ ప్రిన్సిపాళ్లు విధిత గౌడ్, శ్యాం, జ్యోష్న, అధ్యాపకుల బృందం అభినందించారు.