అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sudarshan Reddy | ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్, డిస్టిక్ట్ సెక్యురిటీ కౌన్సిల్ మెంబర్ రజనీకాంత్ (Kakatiya Educational Institutions Rajinikanth) శనివారం కలిశారు. హైదరాబాద్‌లో (Hyderabad) ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాకు సుదర్శన్‌రెడ్డి పెద్ద దిక్కు అన్నారు. సీనియర్ నాయకుడికి పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు.
సుదర్శన్‌రెడ్డి (MLA Sudarshan Reddy) గతంలో మంత్రిగా పని చేసిన సమయంలో ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. నిజామాబాద్‌కు మెడికల్ కాలేజీ (medical college) తీసుకు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న సుదర్శన్‌రెడ్డికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ఉన్నారు.
