అక్షరటుడే, ఇందూరు: Kakatiya Institutions | కాకతీయ ఒలింపియాడ్ స్కూల్స్ (Kakatiya Olympiad Schools) ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో అకడమిక్ మహోత్సవం కొనసాగుతోంది. ఈ నెల 22వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం బుధవారం వరకు సాగనుంది.
Kakatiya Institutions | నైపుణ్యాలను పెంపొందించేందుకు..
కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రజనీకాంత్ (director Rajinikanth) ఆధ్వర్యంలో ‘జాతీయ గణిత దినోత్సవం’లో భాగంగా గణితం, సైన్స్ సబ్జెక్ట్‌లలో అకడమిక్ మహోత్సవం కొనసాగుతోంది. విద్యార్థుల మేధస్సు, నైపుణ్యాలను పెంపొందించేందుకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వినూత్న కార్యక్రమాలను ఈ ఫెస్ట్‌లో నిర్వహిస్తున్నారు.
అత్యాధునిక ఐఐటీ సిలబస్ ఆధారంగా గణిత ప్రతిభను పరీక్షించేందుకు నిర్వహించిన ‘మ్యాథ్స్ రత్న’ పోటీల్లో గణితానికి సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులు ఎదుర్కొన్న తీరు అమోఘమని న్యాయనిర్ణేతలు ప్రశంసించారు.

Kakatiya Institutions | స్పెల్థాన్లో అద్భుతమైన ప్రతిభ
భాషా నైపుణ్యాలను వెలికితీసే ‘స్పెల్థాన్’లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. తమ ఆలోచనలను క్రమబద్ధంగా వ్యక్తపర్చే ‘టెడ్ కాకతీయ’ కార్యక్రమంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలలో విద్యార్థులు అనన్యమైన వాదనా పటిమను ప్రదర్శించారు. అన్ని సబ్జెక్టుల్లోనూ పోటీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన ‘క్విజ్థాన్’లో విద్యార్థులు జట్లుగా ఏర్పడి ఐకమత్యంతో పోటీపడ్డారు.
Kakatiya Institutions | మ్యాథ్స్ ఫెస్ట్‌లో విద్యార్థుల ప్రదర్శన భేష్..
ఆయా విభాగాల్లో, ముఖ్యంగా మ్యాథ్స్‌కు సంబంధించిన ప్రశ్నలలో విద్యార్థులు చూపిన ప్రతిభ, స్పెల్లింగ్స్, కమ్యూనికేషన్లో పిల్లలు ప్రదర్శించిన వాగ్ధాటికి న్యాయనిర్ణేతలు, ముఖ్య అతిథులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన కొన్ని రౌండ్లలో విజయం సాధించిన జట్లు ఈరోజు మరిన్ని రౌండ్లలో పోటీపడ్డాయి. ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.

Kakatiya Institutions | ప్రతిభను అభివృద్ధి చేయడమే లక్ష్యం
కాకతీయ ఒలింపియాడ్ స్కూల్స్ డైరెక్టర్ రజనీకాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో మ్యాథ్స్, సైన్స్ (mathematics and science) విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యార్థుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రతిభను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ అకాడమిక్ మహోత్సవంలో కాకతీయ విద్యా సంస్థల అన్ని బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి సహకారం అందిస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
నగరంలోనే తొలిసారి..: కాకతీయ ఒలింపియాడ్ స్కూల్స్ డైరెక్టర్ రామోజీ రావు
కాకతీయ ఒలింపియాడ్ స్కూల్స్ డైరెక్టర్ రామోజీ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో తొలిసారి ఈ తరహా అకాడమిక్ మహోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు ఇంత వేగంగా, కచ్చితంగా మ్యాథ్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం.. ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లోని కష్టమైన పదాల స్పెల్లింగ్స్‌ను కూడా చాలా వేగంగా, సరిగ్గా చెప్పడం చూస్తే ఎంతో ముచ్చటగా ఉందని అన్నారు.
‘విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితమే కాకుండా, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించేదిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అకడమిక్ మహోత్సవం అలాంటి ప్రయత్నంలో ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పారు. విద్యార్థులు తమ ప్రతిభతో తల్లిదండ్రులకు, పాఠశాలకు గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
