అక్షరటుడే, ఇందూరు: Kakatiya Academic Festival | అకాడమీ మహోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని కాకతీయ విద్యాసంస్థల (Kakatiya Educational Institutions) డైరెక్టర్ రజనీకాంత్ తెలిపారు. శ్రీనివాస రామానుజన్ జయంతి, మండవ వెంకట సుబ్బారావు స్మారకంగా.. మూడు రోజులుగా నిర్వహిస్తున్న అకడమిక్ మహోత్సవం (academic festival) బుధవారం ముగిసింది.
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. స్పెల్థాన్ పేడ్, కాకతీయ క్విజ్ థాన్, మ్యాచ్ రత్న అకాడమిక్ గేమ్స్ తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. సబ్జెక్టుపై ఆసక్తిని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. అనంతరం ఆయా విభాగాల్లో విజయం సాధించిన విద్యార్థులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు రామోజీరావు, రాజా, సిబ్బంది పాల్గొన్నారు.