HomeUncategorizedKajol | రామోజీ ఫిలింసిటీకి జీవితంలో వెళ్ల‌ను.. అదొక భ‌యాన‌క ప్ర‌దేశం: కాజోల్

Kajol | రామోజీ ఫిలింసిటీకి జీవితంలో వెళ్ల‌ను.. అదొక భ‌యాన‌క ప్ర‌దేశం: కాజోల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Kajol | బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మా అనే సినిమా చేస్తున్న కాజోల్ ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది.

రామోజీ ఫిలిం సిటీ అత్యంత భ‌యానక ప్ర‌దేశం అని చెప్పుకొచ్చింది “ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగిటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడ‌తాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, మరోసారి అక్కడికి రాకూడదు అని అనిపిస్తుంది. హైదరాబాద్(Hyderabad)లోని రామోజీ ఫిలిం సిటీ అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత భయంకర‌మైన చోటు” అని చెప్పుకొచ్చింది కాజోల్.

Kajol | అలా అనేసింది ఏంటి?

కాజోల్(Kajol)ని అంతలా భయపెట్టిన సంఘటన ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. కాగా.. కాజోల్ రీసెంట్ టైంలో సలాం వెంకీ, లవ్ స్టోరీస్ 2, దో పత్తి త‌దిత‌ర చిత్రాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు మా అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం జూన్ 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాజోల్ ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్(Bollywood star heroine)గా ఓ వెలుగు వెలిగింది. ఇండియాలోనే పేరుమోసిన హీరోయిన్ల జాబితాలో ఆమె పేరు ముందు వరుసలో ఉంటుంది. సౌత్ ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే పనిచేసినా.. ఆమె నటించిన హిందీ చిత్రాలు తెలుగులోనూ డబ్ అవ్వడంతో దక్షిణాది ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో సీనియర్ నటిగా, ఇంకా వెండితెరపై మెరుస్తోంది. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ అలరిస్తోంది. తన రాబోయే చిత్రం కోసం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. 1992 నుంచి కాజోల్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ సరసన ఎక్కువ సినిమాల్లో నటించింది. దక్షిణాది ప్రేక్షకులను ‘మెరుపు కలలు’ (Merupu kalalu) అనే చిత్రంతో అలరించింది. అరవింద్ స్వామి, ప్రభు దేవాలతో కలిసి నటించింది. ఆ చిత్రంతో దక్షిణాది ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరైంది. చాలా గ్యాప్ తర్వాత ధనుష్ ‘రఘువరన్ బీటెక్ 2’ చిత్రంలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది.