అక్షరటుడే, వెబ్డెస్క్ : Kadiyam Srihari Comments | స్టేషన్ ఘన్పూర్ (Station Ghanpur) ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. జాతిపిత అన్ని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి అన్నారు.
కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ (BRS) నాయకులు అధికారం కుటుంబ హక్కుగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. ప్రజలు వాళ్లకు ఓటు రూపంలో బుద్ధి చెప్పారన్నారు. ప్రజలు వాళ్ళను పట్టించుకోవడం లేదనడానికి మున్సిపల్ ఎన్నికల (Municipal elections) ఫలితాలే నిదర్శనమని చెప్పారు.
Kadiyam Srihari Comments | జాతిపిత ఒక్కరే..
కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలు చూసి ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేయడం లేదని కడియం అన్నారు. జాతిపిత ఒక్కరే ఉన్నారని, ఆయనే మహాత్మా గాంధీ అన్నారు. కేసీఆర్ ఎం చేశారని జాతిపిత అని చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడి వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 2014 ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని…? ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రజల ముందు పెట్టాలని సవాల్ చేశారు. కేసీఆర్ కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ కేసులలో ఇరుక్కున్నారని విమర్శించారు. వాళ్ల మీద కేసులు అయితే తెలంగాణను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ‘‘తెలంగాణ మీ అయ్యా సొత్తా”అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తారని విమర్శించారు.