అక్షరటుడే, వెబ్డెస్క్: Kadiyam Srihari Controversy | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మానసిక పరిస్థితి సరిగా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ (BRS MLA Vivekananda Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై స్పీకర్ గురువారం విచారణ చేపట్టారు. అనంతరం వివేకానందగౌడ్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ (Congress)లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కేపీ వివేకానందగౌడ్ పిటిషన్ వేశారు. దీనిపై స్పీకర్ విచారణ చేపట్టారు. వివేకానంద అడ్వొకేట్లను కడియం శ్రీహరి అడ్వొకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కడియం పార్టీ మారినట్లు ఉన్న ఆధారాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు అందజేశారు.
Kadiyam Srihari Controversy | బయట కాంగ్రెస్.. లోపల బీఆర్ఎస్
విచారణ అనంతరం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడుతూ.. కడియం అసెంబ్లీ బయట కాంగ్రెస్ అంటారని, అసెంబ్లీలో మాత్రం BRS అంటారని విమర్శించారు. ఆయనకు కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టారన్నారు. కేసీఆర్ (KCR) కాళ్లు పట్టుకుంటే కడియంకు ఎంపీ అవకాశం వచ్చిందన్నారు. దమ్ముంటే కడియం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన పదవులు అనుభవించిన ఆయనకు..ఇప్పుడు కేసీఆర్ కనిపించడం లేదా అన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.కడియం శ్రీహరిలాగ కేసీఆర్ ఎప్పుడూ ఆత్మగౌరవాన్ని తాకట్టు బెట్టుకొని, పదవుల కోసం పాకులాడి, బేరసారాలు చేయలేదని వివేకానంద అన్నారు. బీఆర్ఎస్ లో గెలిచిన ఆయన కాంగ్రెస్లో చేరి కూతురుకు టికెట్ ఇప్పించి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న కడియం శ్రీహరి ఇంకా తను బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లోనే ఉన్నానని బుకాయించడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.