అక్షరటుడే, బాన్సువాడ : Kadapuri Ganganna Statement | రాజకీయంలో ప్రతిఒక్కరూ విలువలు పాటించాలని కాంగ్రెస్ (Congress Party) సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ కాదేపురం గంగన్న అన్నారు. బీర్కూర్ మండలంలోని (Birkur Mandal) బరంగేడ్గి గ్రామంలో శనివారం కాంగ్రెస్ నాయకులతో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
Kadapuri Ganganna Statement | ప్రజాతీర్పును శిరసావహించాలి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా తీర్పును ఎంతటివారైనా శిరసావహించాల్సిందేనని గంగన్న అన్నారు. ప్రజలు ఎత్తుకున్నారని సంబరపడవద్దని, వారి నమ్మకాన్ని వమ్ము చేస్తే ఆ ఎత్తుకున్న ప్రజలే పాతాళానికి తొక్కుతారని వ్యాఖ్యానించారు. తమ గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు శుక్రవారం చేసిన ప్రకటన బాధాకరమన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) ఆగమేఘాల మీద సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారని అనడం సిగ్గుచేటన్నారు.
Kadapuri Ganganna Statement | బాన్సువాడను అభివృద్ధి చేసింది పోచారమే..
బాన్సువాడ నియోజకవర్గాన్ని (Banswada Constituency) అభివృద్ధి చేసింది, బాన్సువాడకు విలువైన రాజకీయాలు నేర్పింది పోచారమేనని గంగన్న పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు గ్రామాభివృద్ధికి తాము అడ్డుకాదని, మాకు చేతనైనంత తమ నాయకులు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సహకారంతో నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మీరు కూడా గ్రామానికి నిధులు తెచ్చి, అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు.
Kadapuri Ganganna Statement | లేనిపోని విమర్శలు చేయవద్దు..
రాజకీయాల్లో అర్థంలేని విమర్శలు చేస్తే ఊరుకోబోమని గంగన్న హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గోండ్ల శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, నాయకులు ఇందూర్ గజేందర్, పుల్కంటి హన్మంత్, కుర్మ నాగుగొండ, కోరె హావగిర్ రావు, హట్కరి దశరథ్, మొండికారి వీరప్ప, బుజ్జిగొండ, గాజుల గజేందర్, నీరడి రాములు, బసలింగప్ప, క్యాదెని లింగప్ప, సాలె సాయిబాబా, జాకారం గంగారాం తదితరులు పాల్గొన్నారు.