ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​kadapa | దారుణం.. మూడేళ్ల చిన్నారిని చిదిమేసి ఆపై ఆత్మ‌హ‌త్య‌

    kadapa | దారుణం.. మూడేళ్ల చిన్నారిని చిదిమేసి ఆపై ఆత్మ‌హ‌త్య‌

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: kadapa | ఈ మధ్య మ‌నుషులు కొంద‌రు మృగాలుగా మారి విచ‌క్ష‌ణ కోల్పోతున్నారు. అస‌లు ఏం చేస్తున్నారో తెలియ‌డం లేదు. అభం శుభం తెలియ‌ని చిన్నారుల‌ని కూడా చిదిమేస్తున్నారు. తాజాగా జరిగిన సంఘ‌ట‌న స‌భ్య‌స‌మాజం సిగ్గుప‌డేలా చేస్తోంది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా.. ఆ పసిపాపను ఆడిస్తున్నట్టు నటిస్తూ చర్చి church వెనక్కు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన వైఎస్సార్‌ కడప జిల్లాYSR Kadapa district మైలవరం మండలం Mylavaram mandal ఎ.కంబాలదిన్నెలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకుంది.

    kadapa | పాప‌.. క్ష‌మిస్తావా..

    పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఎ.కంబాలదిన్నె గ్రామానికి చెందిన యువకుడికి జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన యువతికి శుక్రవారం వరుడి గ్రామంలోని చర్చిలో వివాహం జరిగింది. ఈ పెళ్లికి ప్రొద్దుటూరు మండలానికి చెందిన తల్లిదండ్రులు తమ మూడేళ్ల కుమార్తెను తీసుకుని గురువారమే వచ్చారు. కాగా.. మోరగుడి నుంచి దూదేకుల రహమతుల్లా(26) Rahamatulla కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు. గురువారం రాత్రి చిన్నారితో ఆడుకుంటున్న‌ట్టు క‌నిపించాడు. శుక్ర‌వారం మ‌ధ్యాహానికి పాప క‌నిపించ‌డం లేదు. బాలిక తల్లిదండ్రులతోపాటు అందరూ చుట్టుపక్కల వెదకడం ప్రారంభించారు. అయితే అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా.. రహమతుల్లా చిన్నారిని మాయమాటలు చెప్పి చర్చి వెనక్కు తీసుకెళ్లాడు.

    ఆమె నోట్లో అరటిపండు కుక్కి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను దారుణంగా కొట్టి చంపి.. మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశాడు. ఆపై ఏమీ ఎరగనట్టు చర్చిలోకి వచ్చాడు. రహమతుల్లా చొక్కాపై రక్తపు మరకలు గమనించి అతన్ని నిలదీయ‌డంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతన్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఇంతలో కొందరు చర్చి వెనుక ముళ్లపొదల్లో పడిఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. అయితే హ‌త్య‌చారం చేసిన నిందితుడు ఆత్మ‌హ‌త్య చేసుకోగా, బుధ‌వారం మైల‌వ‌రం జ‌లాశ‌యం Milevaram reservoirలో అత‌ని మృత‌దేహాన్ని గుర్తించారు. శ‌వ‌ప‌రీక్ష చేశాక దూదేకుల ర‌హ‌మ‌తుల్లాగా గుర్తించారు. అయితే అతడి మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యులకు అప్ప‌గించేందుకు పోలీసులు Police వెళ్ల‌గా నిరాక‌రించార‌ట‌. దీంతో మున్సిపాలిటీకి అంద‌జేశారు. దాంతో వారు మృతదేహాన్ని ట్రాక్ట‌ర్‌లో త‌ర‌లించి ద‌హ‌న సంస్కారాలు పూర్తి చేశారు. కాగా మోర‌గుడి గ్రామ‌స్థులు నిందితుడి ఇంటిని జేసీబీ (JCB)తో నేల‌మ‌ట్టం చేయించినట్లు సమాచారం.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...