Kabaddi Subbarao
Kabaddi Subbarao | కబడ్డీ సుబ్బారావు ఇకలేరు..

అక్షరటుడే, ఇందూరు: Kabaddi Subbarao | నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కబడ్డీ కోచ్ సుబ్బారావు మృతి చెందారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు.

జిల్లా కబడ్డీ క్రీడలో ఎనలేని ముద్ర వేసుకొని.. సుమారు 35 ఏళ్లకు పైగా కబడ్డీలో ఎంవీ సుబ్బారావు సేవలందించారు. జాతీయ సీనియర్ కబడ్డీ క్రీడాకారుడిగా రాణించి.. జిల్లా కబడ్డీ సంఘానికి (District Kabaddi Association) ఎంతో సేవ చేశారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సంఘం ఉపాధ్యక్షుడిగా, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం (Physical Education Teachers’ Association) ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. గతంలో ఒలింపిక్ సంఘం, జిమ్నాస్టిక్ అసోసియేషన్ కి (Gymnastic Association) సేవలందించారు. మోడ్రన్ పబ్లిక్ స్కూల్ లో పీఈటీగా పనిచేశారు. స్పోర్ట్స్ జర్నలిస్టుగానూ అనేక ఏళ్లు పనిచేశారు.

Kabaddi Subbarao | క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ..

ఆయన పీఈటిగా ఉన్న సమయంలో అనేక మంది క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించారు. భారత హాకీ క్రీడాకారిణి, ప్రస్తుత హాకీ మహిళా కోచ్ యెండల సౌందర్య (Hockey women’s coach Yendala Soundarya) సుబ్బారావు శిష్యురాలు. ఆమెతో పాటు అనేకమంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారు. ఆయన మృతిపట్ల క్రీడాసంఘలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాయి.