HomeసినిమాK-Ramp Review | కిరణ్ అబ్బవరం ‘K-Ramp’ రివ్యూ.. దీపావళి స్పెషల్ రొమాంటిక్ కామెడీ

K-Ramp Review | కిరణ్ అబ్బవరం ‘K-Ramp’ రివ్యూ.. దీపావళి స్పెషల్ రొమాంటిక్ కామెడీ

కిరణ్​ అబ్బవరం హీరోగా నటించిన ‘K-Ramp’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్‌గా, నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : K-Ramp Review | షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో హీరోగా అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) , ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తాజాగా వచ్చిన ‘K-Ramp’ సినిమా అక్టోబర్ 18, 2025న థియేటర్లలో విడుదలైంది. యుక్తి తరేజా హీరోయిన్‌గా (Heroine Yukti Tareja) , నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాతో కిర‌ణ్ హిట్ కొట్టాడా, చిత్ర క‌థ ఏంట‌నేది చూద్దాం.

K-Ramp Review | కథ :

అల్లరిగా జీవించి, జీవితాన్ని పూర్తి ఎంజాయ్ చేయాలనుకునే కుమార్ (కిరణ్ అబ్బవరం), చదువుల కోసం కేరళకు వెళ్తాడు. కేరళలోని ఇంజినీరింగ్ కాలేజీలో అడ్మిట్ అవుతాడు. అక్కడకి తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిన కుమార్, జాయ్ మెర్సీ (యుక్తి) ను ప్రమాదం నుంచి రక్షిస్తాడు. దాంతో వారి ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుంది. అక్కడ హీరోయిన్ ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఆమెకి Post-traumatic Stress Disorder (PTSD) అనే మానసిక వ్యాధి ఉందని తెలుసుకున్న వెంటనే కథ సాగుతుంది. ఈ వ్యాధి నేపథ్యంలో హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చివరికి కథ ఎలా ముగుస్తుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సి ఉంటుంది.

నటీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్:

కిరణ్ అబ్బవరం తన స్టైల్ డైలాగ్ డెలివరీ, పంచ్‌లు, సింగిల్ లైనర్స్ తో యూత్‌కి చక్కగా కనెక్ట్ అయ్యాడు. యుక్తి తరేజా గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నది. నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తమ పాత్రల్లో కామెడీని బాగా వర్కౌట్ చేశారు.న‌టీన‌టులు త‌మ పాత్ర‌లమేర న‌టించి మెప్పించారు.

టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:

చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అయింది. కెమెరామెన్ సతీశ్ రెడ్డి కేరళ అందాలను తెరపై అందంగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో కొంత కత్తెర పనిని మిస్ చేసినట్టు అనిపిస్తుంది, కొన్ని సీన్లు సెకండ్ హాఫ్‌లో అనవసరంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఓ సీరియస్ మానసిక రుగ్మతని తీసుకుని, దాని చుట్టూ కామెడీ లవ్‌స్టోరీని అల్ల‌డంతో డైరెక్టర్ జైన్స్ నాని సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. కథ, కథనాల్లో ఏం జరుగుతుందో మ‌నం ముందే ఊహించొచ్చు. అలాంటి కథతోనూ ఎక్కడ‌ బోర్ కొట్టించకుండా కామెడీని వర్కవుట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు జైన్స్ నాని.. సెకండాఫ్ కాస్త డీలాప‌డేలా చేశాడు.

న‌టీన‌టులు : కిరణ్ అబ్బవరం యుక్తి తరేజా,నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్
ద‌ర్శ‌క‌త్వం : జైన్స్ నాని
సంగీతం : చైత‌న్ భ‌ర‌ద్వాజ్
బ్యాన‌ర్ : రుద్రాన్ష్ సెల్యులాయిడ్
కెమెరామెన్ : సతీశ్ రెడ్డి

ప్ల‌స్ పాయింట్స్:

  • ఇంటర్వెల్ తర్వాత కామెడీ
  • కిరణ్ అబ్బవరం నటన

నెగటివ్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్
  • కొంత క్రాస్ హ్యూమర్
  • పాట‌లు
  • విశ్లేష‌ణ‌:

‘K-Ramp’ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీగా సక్సెస్ అయ్యింది. ‘క’ వంటి విభిన్న కాన్సెప్ట్ తర్వాత కిరణ్ అబ్బవరం రూట్ మార్చకుండా యూత్ కి కనెక్ట్ అయ్యే కామెడీ-లవ్ ఎంటర్‌టైనర్ తీసుకొచ్చాడు. కొత్తదనం కొంత లోపించినప్పటికీ, సింపుల్, సిల్లీ కామెడీ సినిమాలు ఇష్టపడేవారికి సినిమా బాగా నచ్చుతుంది. హాస్యం, రొమాన్స్, సింగిల్ లైన్ డైలాగ్‌లు, కేరళ అందాలు అన్ని కలిపి ప్రేక్షకులకు టైం పాస్ మూవీగా ఉంటుంది. సినిమా మొదటి భాగం అలా సోసోగా మూవీ న‌డుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కథకు కొంత మొమెంటం వస్తుంది. హీరోయిన్ PTSD రియాక్షన్స్ నుంచి వచ్చే కామెడీ సుమారుగా 30 నిమిషాల పాటు బాగా పని చేస్తుంది. కానీ ఆ తర్వాత ప్రేమకథ లోతైన భావోద్వేగాన్ని అందించడంలో విఫలమవుతుంది. సీనియర్ నటుడు నరేష్ కామెడీ ట్రాక్ కొంత వ‌ర‌కు ప‌ర్వాలేదు. హాస్యాన్ని ఇష్ట‌ప‌డేవారు ఒక్క‌సారి ఈ చిత్రాన్ని చూడొచ్చు.

రేటింగ్‌ : 2/5

Related News