ePaper
More
    HomeజాతీయంYouTuber Jyoti Malhotra | విచార‌ణ‌లో నోరు మెదుప‌ని జ్యోతి.. చాటింగ్ వివ‌రాల‌న్నీ తొల‌గించిన మ‌ల్హోత్రా!

    YouTuber Jyoti Malhotra | విచార‌ణ‌లో నోరు మెదుప‌ని జ్యోతి.. చాటింగ్ వివ‌రాల‌న్నీ తొల‌గించిన మ‌ల్హోత్రా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: YouTuber Jyoti Malhotra | యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు (youtuber jyoti malhotra) సంబంధించిన గూఢచర్య దర్యాప్తులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ హైకమిషన్ మాజీ అధికారి డానిష్‌తో ఆపరేషన్ సిందూర్ (operation sindoor) గురించి మల్హోత్రా చేసిన చాటింగ్ వివ‌రాల‌ను తొల‌గించిన‌ట్లు తెలిసింది. ఇది కీలకమైన డిజిటల్ ఆధారాలను (digital proofs) తారుమారు చేసే ప్రయత్నమని విచార‌ణ అధికారులు తెలిపారు.

    YouTuber Jyoti Malhotra | నోరు విప్ప‌ని జ్యోతి..

    పాకిస్తాన్‌కు గూఢ‌చ‌ర్యం (pakistan spy) చేస్తుంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై అరెస్టు అయిన హ‌ర్యానాకు చెందిన యూట్యూబ‌ర్‌, వ్లాగ‌ర్ జ్యోతి మ‌ల్హోత్రా (vloger jyoti malhotra) పోలీసుల విచార‌ణ‌లో నోరు విప్ప‌డం లేద‌ని తెలిసింది. ఎన్ని ర‌కాలుగా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించినా ఆమె నోరు మెద‌ప‌డం లేద‌ని స‌మాచారం. జాతీయ ద‌ర్యాప్తు బృందం (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు వివివిధ కోణాల్లో ఆమె నుంచి సమాధానాలు రాబ‌ట్టేందుకు య‌త్నిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌, చైనా, బంగ్లాదేశ్‌ల‌లో (pakistan, china and bangladesh) ఆమె చేసిన ప‌ర్య‌ట‌న‌ల‌పై ఆరా తీస్తున్నట్లు వినికిడి. అయితే, ఆమె వాస్త‌వాలు చెప్ప‌కుండా ద‌ర్యాప్తును త‌ప్పుదారి ప‌ట్టించేందుకు య‌త్నిస్తున్న‌ట్లు తెలిసింది. పాకిస్తాన్ నిఘా అధికారి డానిష్‌తో (pakistani intelligence officer danish) తనకున్న వ్యక్తిగత సంబంధం గురించి అబద్ధం చెప్పినట్లు సమాచారం. డానిష్‌తో ఉన్న ఫొటోల‌ను చూపించగా, నోరు తెర‌వలేద‌ని తెలిసింది.

    YouTuber Jyoti Malhotra | చాటింగ్ వివ‌రాలు తొల‌గింపు..

    న్యూఢిల్లీలోని (new delhi) పాకిస్తాన్ హైకమిషన్‌లో ప‌ని చేసే స‌మ‌యంలో డానిష్‌ను మే 13న గూఢచర్యం ఆరోపణలపై పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించిన తర్వాత అత‌డ్ని ఇండియా నుంచి బ‌హిష్క‌రించారు. పాకిస్తాన్ హైకమిషన్‌లో (pakistan high commission) జరిగిన సమావేశంలో డానిష్.. జ్యోతి మల్హోత్రాను చాలా మంది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌ (పీఐవో)లకు పరిచయం చేశాడు. పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి వారు చర్చిస్తున్నప్పుడు డానిష్ తన భార్యను జ్యోతికి పరిచయం చేసిన‌ట్లు గుర్తించారు. అలాగే, జ్యోతి మల్హోత్రా ఆపరేషన్ సిందూర్ (operation sindoor) గురించి డానిష్‌తో చేసిన చాట్‌లను తొల‌గించిన‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే, త‌న మొబైల్‌లోని కీల‌క డేటాను, ఆధారాల‌ను తొల‌గించిన‌ట్లు గుర్తించారు. జ్యోతి ఆపరేషన్ సిందూర్ గురించి డానిష్‌తో కీల‌క‌ వివరాలను పంచుకుంది. హిసార్‌లో బ్లాక్‌అవుట్ సమయం గురించి, అలాగే బ్లాక్‌అవుట్ (black out) సమయంలో పరిపాలనా కార్యకలాపాల గురించి, సైరన్‌లు, అధికారిక సందేశాల గురించి డానిష్‌కు వివ‌రించిన‌ట్లు గుర్తించారు. అయితే, ఇటీవ‌ల ఆమెను అరెస్టు చేసిన స‌మ‌యంలో ఫోన్ క్లీన్‌గా ఉండ‌డంతో ఆమె కీల‌క ఆధారాలు తొల‌గించిన‌ట్లు గుర్తించారు. దీంతో తొల‌గించిన డేట‌ను రిట్రైవ్ చేసేందుకు ఆమె ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

    YouTuber Jyoti Malhotra | పాక్‌, చైనాలో ఏం చేసింది?

    జ్యోతి 2014 మే 17న‌ బైసాఖి పండుగ (baisakhi festival) కోసం పాకిస్తాన్‌కు వెళ్లింది. పండుగ పది రోజులు కొనసాగినప్పటికీ, ఆమె 20 రోజులకు పైగా పాకిస్తాన్‌లోనే ఉండి, అనంత‌రం నెల పాటు చైనాకు వెళ్లింది. పండుగ తర్వాత ఆమె పాకిస్తాన్‌లో ఎక్కడికి వెళ్లింది, ఎవరిని కలిసింది, చైనా పర్యటన (china visit) అంత‌కు ముందే ఖ‌రారైందా? అస‌లు చైనాకు ఎందుకు వెళ్లింద‌నే దానిపై ద‌ర్యాప్తు ఏజెన్సీలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

    More like this

    Nizamabad City | గాయత్రి నగర్‌లో స్వచ్ఛభారత్

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని గాయత్రి నగర్ అంగన్వాడి కేంద్రంలో బుధవారం స్వచ్ఛభారత్...

    Nizamabad KFC | కేఎఫ్​సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్​లో (Venu Mall) గల...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...