అక్షరటుడే, వెబ్డెస్క్:YouTuber Jyoti Malhotra | పాకిస్థాన్(Pakistan)కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలతో అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.
పాక్‌కు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో జ్యోతి పాక్‌కు కీలక సమాచారం అందించినట్లు అనుమానాలు ఉండడంతో ఆమెని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పాక్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వెళ్లే భారతీయులను లక్ష్యంగా చేసుకుని, వారిని గూఢచర్యానికి ఉపయోగించుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. అలాంటి తరహాలోనే డానిష్ (Danish) కూడా జ్యోతిని టార్గెట్ చేశాడని పోలీసులు వెల్లడించారు
YouTuber Jyoti Malhotra | అంత మర్యాదలు ఏంటి?
పాకిస్థాన్ పర్యటనలో జ్యోతికి రాచమర్యాదలు జరిగినట్లు ఓ వీడియో ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చింది. లాహోర్ లోని అనార్కలీ బజార్(Anarkali Bazaar) సందర్శించిన సమయంలో జ్యోతి మల్హోత్రాకు ఏకంగా ఆరుగురు గన్ మెన్లు ఏకే 47 ఆయుధాలతో భద్రత కల్పించారు. స్కాట్లాండ్ కు చెందిన ఓ యూట్యూబర్ వీడియోలో జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) గన్ మెన్ల భద్రత మధ్య వీడియోలు తీసుకోవడం కనిపించింది. జ్యోతి మల్హోత్రాకు కల్పించిన సెక్యూరిటీపై స్కాట్లాండ్ యూట్యూబర్ ఆశ్చర్యపోయారు. స్కాంట్లాడ్ యూట్యూబర్ క్యాలమ్ మిల్ ఆమెతో పలకరించి మాట్లాడుతుండగా, తాను స్కాట్లాండ్‌కు చెందిన యూట్యూబర్‌ని అని చెప్పాడు. ఈ నేపథ్యంలో జ్యోతి సమాధానంగా తాను భారత్ నుండి వచ్చినట్టు తెలిపింది.
అనంతరం జ్యోతి అతడిని మొదటిసారిగా పాకిస్థాన్ వచ్చారా? అని ప్రశ్నించగా.. క్యాలమ్ ఇప్పటివరకు ఐదు సార్లు పాక్‌కి వచ్చానని చెప్పాడు. పాకిస్థాన్ ఆతిథ్యంపై ఆమె అభిప్రాయాన్ని అడిగినప్పుడు, “చాలా బాగుంది” అని జ్యోతి సమాధానమిచ్చింది. తర్వాత ఆమె అక్కడినుండి వెళ్లిపోయే సమయంలో ఆమె చుట్టూ సాధారణ దుస్తుల్లో ఉన్న ఆరుగురు వ్యక్తులు ఏకే-47 తుపాకులతో భద్రత కల్పిస్తున్నట్లు క్యాలమ్ గమనించాడు.
దీనిని చూసి అతడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. వారందరూ వేసుకున్న జాకెట్లపై “నో ఫియర్” అనే పదాలు ముద్రించి ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. కాలమ్ మిల్ గత మార్చి నెలలో పాకిస్థాన్‌లో పర్యటించారు. కాలమ్ మిల్ ఒంటరిగా తిరుగుతుంటే, జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)కు ఇంత భారీ భద్రత ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.