ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | కేసీఆర్​, కేటీఆర్​ జైలుకు వెళ్తేనే న్యాయం జరుగుతుంది : కొండా...

    Phone Tapping Case | కేసీఆర్​, కేటీఆర్​ జైలుకు వెళ్తేనే న్యాయం జరుగుతుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former CM KCR)​, మాజీ మంత్రి కేటీఆర్(former Minister KTR)​ జైలుకు వెళ్తేనే న్యాయం జరుగుతుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి అన్నారు. గతంలో ఆయన ఫోన్​ ట్యాప్​ అయినట్లు సిట్​ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయన వాంగ్మూలం సేకరించేందుకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్​రెడ్డి(Konda Vishweshwar Reddy) శుక్రవారం సిట్​ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

    బీఆర్​ఎస్​ హయాంలో తన భార్య ఫోన్​ కూడా ట్యాప్​ చేశారన్నారు. ఫోన్​ ట్యాప్​ చేసి తనను బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. డీజీపీ మహేందర్​రెడ్డి(DGP Mahender Reddy) సైతం తనను బెదిరించారని.. అరెస్ట్ అవుతారని చెప్పారన్నారు. దీంతో తాను రెండు వారాలు బెంగళూరుకు పారిపోయి హోటల్​లో ఉన్నట్లు ఎంపీ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలకమైన కేసీఆర్, కేటీఆర్​పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కాకపోతే కేంద్ర ఏజెన్సీలకు కేసును అప్పగించాలని సూచించారు. ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారాన్ని తాము పార్లమెంట్​లో లేవనెత్తుతామని కొండా విశ్వేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ పాలన ఉన్న ప్రాంతీయ పార్టీలతో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. అయితే ఇలాంటివి మళ్లీ జరగకుండా నిందితులను శిక్షించాలని కోరారు.

    Phone Tapping Case | కాంగ్రెస్​లో చేరడంతో..

    కొండా విశ్వేశ్వర్​రెడ్డి 2014లో బీఆర్ఎస్​ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. పార్టీలో ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని 2018 నవంబర్​లో పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్​లో చేరారు. 2019లో ఆయన కాంగ్రెస్​ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన కాంగ్రెస్​లో చేరినప్పటి నుంచే బీఆర్​ఎస్​ నిఘా పెట్టినట్లు సమాచారం. ఎన్నికల ముందే తనను అరెస్ట్ చేయాలని చూశారని.. కాకపోతే సింపతి వస్తుందనే భయంతో ఆగిపోయారని కొండా విశ్వేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. 2019 ఎన్నికల అనంతరం తనను బీఆర్​ఎస్​ నాయకులు బెదిరించారన్నారు. కాగా విశ్వేశ్వర్​రెడ్డి 2022 జులైలో బీజేపీలో చేరారు. 2024 లోక్​సభ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీగా విజయం సాధించారు.

    More like this

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...

    Super Six | “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి .. ఎవ‌రెవ‌రు హాజ‌రు కానున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Super Six | కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలిసారిగా అధికార పక్షం ఆధ్వర్యంలో...