అక్షరటుడే, వెబ్‌డెస్క్: CJI BR Gawai | భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (CJI Justice BR Gavai) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపది ద్రౌపది ముర్ము (President murmu) ప్రమాణం చేయించారు. జస్టిస్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23 వరకు సీజేఐగా కొనసాగనున్నారు. కాగా భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా(Justice Sanjiv khanna) అధికారికంగా జస్టిస్ గవాయ్‌ను తన వారసుడిగా ఏప్రిల్ 20న సిఫార్స్ చేశారు. జస్టిస్ గవాయ్(Justice Gavai) మహారాష్ట్ర maharashtraలోని అమరావతి లో 1960 నవంబర్ 24 జన్మించారు. 1985 మార్చి 16 బార్ అసోసియేషన్‌లో సభ్యుడిగా చేరారు. 1987 నుంచి 1990 వరకు బాంబే హైకోర్టు(Bombay High Court)లో ప్రాక్టీస్ చేశారు. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్(Amaravati Municipal Corporation), అమరావతి విశ్వవిద్యాలయం(Amaravati University) కోసం స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు.
CJI | రెండో దళిత వ్యక్తి
గవాయ్ నాగ్‌పూర్ బెంచ్‌కు ప్రభుత్వ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. అనంతరం 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన ఆయన తాజాగా సీజేఐ(CJI) అయ్యారు. అయితే సీజేఐ పదవి అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ గవాయ్ నిలిచారు. అంతకు ముందు 2007లో మాజీ కేజీ బాలకృష్ణన్ తొలి దళిత సీజేఐగా మూడేళ్లపాటు సేవలందించారు. కాగా జస్టిస్ గవాయ్(Justice Gavai) అనేక కీలక తీర్పులు ఇచ్చారు. రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉండి పలు చరిత్రాత్మక తీర్పుల్లో భాగస్వాములు అయ్యారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా భాగం. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ఆయన సమర్థించారు.
CJI | కాంగ్రెస్‌తో అనుబంధం
జస్టిస్ బీఆర్ గవాయ్ కాంగ్రెస్ కుటుంబానికి కాంగ్రెస్(Congress)తో అనుబంధం ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. 2023 జూలైలో రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై క్రిమినల్ పరువు నష్టం కేసును విచారిస్తున్నప్పుడు జస్టిస్ గవాయ్ తన కుటుంబానికి కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెలిపారు. తన కాంగ్రెస్ సభ్యుడు కాకపోయినా, ఆయన కాంగ్రెస్‌తో చాలా దగ్గరగా 40 ఏళ్లకు పైగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన పార్లమెంటు సభ్యుడు, శాసనసభ సభ్యుడు, కాంగ్రెస్ మద్దతుతో ఉన్నారని చెప్పారు. తన సోదరుడు సైతం రాజకీయాల్లో ఉన్నారని తెలిపారు.