HomeతెలంగాణHigh Court | హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన జస్టిస్ అపరేష్ సింగ్

High Court | హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన జస్టిస్ అపరేష్ సింగ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ సింగ్(Justice Aparesh Singh) శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ నెల 14న ఆయన నియమిలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

జస్టిస్ అపరేష్ కుమార్ త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా (Tripura High Court Judge) పని చేశారు.
అపరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్​ఎల్​బీ చదివారు. 1990 నుంచి 2000 వరకూ యూపీ హైకోర్టులో (UP High Court ) న్యాయవాదిగా పనిచేశారు. అనంతరం 2001లో జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2012లో జార్ఖండ్ హైకోర్టు అదనపు జడ్జీగా నియామకం అయ్యారు.

అనంతరం జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 ఏప్రిల్ నుంచి త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి సాధించారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Telangana High Court Chief Justice)గా బాధ్యతలు చేపట్టారు.