HomeUncategorizedDonald Trump | భారత్, రష్యా దూరమైనట్లే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

Donald Trump | భారత్, రష్యా దూరమైనట్లే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Donald Trump | సుంకాల విధింపుతో భారత్​తో సంబంధాలు ఉద్రిక్తంగా మారిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాము భారత్​తో పాటు రష్యాను దూరం చేసుకున్నట్లు కనిపిస్తోందని, ఇది చాలా బాధాకరమని అన్నారు.

చైనాలోని టియాంజిన్​లో ఇటీవల ముగిసిన షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organization) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ కలిసి ఉన్న ఫొటోను ‘ట్రూత్’లో పోస్ట్ చేసిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మనం ఇండియా, రష్యాను దూరం చేసుకున్నట్లు అనిపిస్తోంది. లోతైన చీకటి చైనా చేతిలో ఆ రెండు దేశాలు చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. వారికి సుదీర్ఘమైన, సంపన్నమైన భవిష్యత్తు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను!” అని కామెంట్ చేశారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించేందుకు విదేశాంగ శాఖ నిరాకరించింది., అమెరికా అధ్యక్షుడి పోస్టుపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయమని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) అన్నారు.

Donald Trump | సుంకాల నేపథ్యంలోనే..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రధానమంత్రి మోదీ (PM Modi), రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin), చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ (Xi Jinping) కీలక చర్చలు జరిపారు. ముగ్గురు అత్యంత ప్రభావంతమైన నేతలు ఒకే వేదికపై కనిపించడం ఆసక్తికరంగా మారింది. టియాంజిన్​లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశంలో జిన్​పింగ్​, ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్న కొన్ని రోజుల తర్వాత ట్రంప్ నుంచి ఈ తరహా వ్యాఖ్య వచ్చింది, అమెరికా అధ్యక్షుడు సుంకాల యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో తాము ముగ్గురం కలిసి ఉన్నామని యునైటెడ్ స్టేట్స్​కు స్పష్టమైన సందేశం ఇస్తూ ఐక్యతను ప్రదర్శించారు.

Donald Trump | అమెరికన్లలో ఆందోళన..

SCO సమావేశం సందర్భంగా మూడు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడంపై అమెరికా ఆందోళనలను ట్రంప్ (Donald Trump) పోస్టు ప్రతిబింబిస్తోంది. మూడు దేశాలు కలిసి ముందుకు నడవాలని నిర్ణయించడం పశ్చిమ దేశాలను కలవరపెట్టింది. భారత వస్తువులపై 25% పరస్పర సుంకాలను విధించిన ట్రంప్ రష్యన్ ముడి చమురు కొంటున్నందుకు మరో 25% సుంకాన్ని విధించిన నేపథ్యంలో వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య వాణిజ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. దశాబ్దాల కాలంగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు కనిష్ట స్థాయికి చేరుకోవడంపై అమెరికన్లలో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది.