అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India | స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు బలమైన పట్టు సాధించింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన టీమిండియా, బ్యాటింగ్‌లో అదరగొట్టి భారీ స్కోర్ సాధించింది.
ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) (100), యువ వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) (125), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) (104 నాటౌట్) అద్భుత శతకాలతో మెరిశారు. వీరి దూకుడు ముందు అనుభవం లేని కరీబియన్ బౌలర్లు తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా జురెల్, జడేజా భాగస్వామ్యం భారత్ ఇన్నింగ్స్‌కు బలం చేకూర్చింది. జురెల్ ఔటైన తర్వాత వాషింగ్టన్ సుందర్ (9 నాటౌట్) జడేజాకు తోడుగా నిలిచాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 286 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Team India | నిరూపించుకున్నాడు..
జడేజా అజేయంగా కొనసాగుతుండడంతో భారత్ స్కోరు మరింత పెరగనుంది. ఇక వెస్టిండీస్ (West Indies) బ్యాట్స్‌మెన్‌పై మరింత ఒత్తిడి ఉండబోతోందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ టెస్టులో భారత్ విజయం వైపు దూసుకెళ్తుందని అభిమానులు నమ్ముతున్నారు. అయితే తొలి టెస్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ అద్భుతంగా రాణించాడు. 24 ఏళ్ల జురేల్ తన టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నమోదు చేశాడు. 190 బంతులు ఎదుర్కొన్న ఆయన 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మూడు అంకెల మైలురాయిని అందుకున్నాడు.
రిషబ్ పంత్ గాయం కారణంగా జట్టులో చోటు దక్కిన జురేల్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో కాలుకు ఫ్రాక్చర్ అయిన పంత్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో, ఈ సిరీస్‌లో వికెట్ కీపర్ బాధ్యతలు జురేల్‌దే అయ్యాయి. నంబర్–5 స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆయన, తన కెరీర్‌లో ఆరో టెస్టులోనే శతకం బాదుతూ ప్రతిభను రుజువు చేసుకున్నాడు. 1953లో విజయ్ మంజ్రేకర్ ఈ ఘనత సాధించినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 11 మంది భారత వికెట్ కీపర్లు మాత్రమే టెస్ట్ సెంచరీ చేసిన జాబితాలోకి జురేల్ చేరాడు. గత పర్యటనల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, ఈ ఇన్నింగ్స్‌తో జట్టులో ఒక స్థిరమైన బ్యాటర్‌గా తన స్థానాన్ని పటిష్ఠం చేసుకున్నాడు. ఆర్మీ మ్యాన్ తనయుడిగా జురేల్ చేసిన సెలబ్రేషన్ కూడా ప్రత్యేకంగా నిలిచింది. సెంచరీ అనంతరం బ్యాట్‌ను రైఫిల్‌లా పట్టుకుని తండ్రికి, సైనికులకు అంకితమిచ్చిన ఆయన గెశ్చర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో రాంచీ టెస్ట్‌లో 90 పరుగుల వద్ద ఔటై నిరాశ చెందిన జురెల్ ఈసారి సెంచరీతో ఆ బాధ తీర్చుకున్నాడు.