HomeUncategorizedJunior Movie Review | జూనియ‌ర్ మూవీ రివ్యూ.. డెబ్యూ చిత్రంతో హిట్ కొట్టాడా..!

Junior Movie Review | జూనియ‌ర్ మూవీ రివ్యూ.. డెబ్యూ చిత్రంతో హిట్ కొట్టాడా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Junior Movie Review | గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) తనయుడు కిరీటి సినిమాపై ప్యాష‌న్‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. జూనియ‌ర్ అనే సినిమాతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఎలా ఉంది..? కిరీటిని హీరోగా నిలబెట్టిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

క‌థ : చిన్నతనంలో నాన్న కోదండపాణి (వి.రవిచంద్రన్) వల్ల ఎన్నో జ్ఞాపకాలను కోల్పోయిన అభి (కిరీటీ) ప్రతిదాంట్లోనూ అనుభవాలతో పాటు మెమోరీస్ వెతుక్కుంటూ ఉంటాడు. అభి తండ్రి కోదండపాణి (రవిచంద్రన్)కి 50 ఏళ్లున్నపుడు కొడుకు పుడతాడు. పుట్టిన వెంటనే అమ్మ చనిపోవ‌డంతో కొడుకును కంటికి రెప్పలా పెంచుతాడు కానీ జనరేషన్ గ్యాప్ వ‌ల‌న‌ అభికి ఏం కావాలనేది కోదండపాణికి అర్థం కాదు. తండ్రి చూపించే అమితమైన ప్రేమతో చిన్న చిన్న సరదాలు కోల్పోతున్న అభి.. హైదరాబాద్ కాలేజీలో జాయిన్ అయి అక్క‌డ తిరిగి సంతోషాన్ని వెతుక్కుంటాడు. అయితే ఇదే స‌మ‌యంలో స్పూర్థి (శ్రీలీల)ను (Heroine Sreelila) చూసి ప్రేమలో పడతాడు. చదువు అయిపోయిన తర్వాత రైస్ సొల్యూషన్స్ అనే కంపెనీలో కొడ‌తాడు. కాగా.. ఆ కంపెనీకి కాబోయే సీఈవో, కంపెనీ ఓనర్(రావు రమేశ్​) కుమార్తె విజయ సౌజన్య (జెనీలియా)తో (Heroine Genelia) గొడవ ప‌డ‌తాడు. అత‌ను అంటే నెగెటివ్ ఒపీనియ‌న్ వ‌స్తుంది. కంపెనీ ప‌నుల్లో భాగంగా విజయనగరం వెళ్లాల్సి వస్తుంది టీం. అభి అక్కడికి వెళ్లి ఏం చేసాడు..? ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అనేది మిగ‌తా క‌థ‌..

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్ : కిరీటీ డెబ్యూ సినిమా అయిన చాలా ఎక్స్‌పీరియ‌న్స్ ఆర్టిస్ట్ మాదిరిగా న‌టించాడు. స్క్రీన్ మీద వైల్డ్ ఫైర్‌లా క‌నిపించి ఉత్సాహ‌పరిచాడు. యాక్టింగ్ అంతంత మాత్రం ఉన్నా కూడా డాన్స్ మాత్రం ఇరగ్గొట్టేశాడు. వైరల్ వయ్యారిలో (Viral Vaiyari) శ్రీలీలను కూడా డామినేట్ చేసి అద‌ర‌గొట్టాడు.. అంతేకాకుండా ఫైట్లు, యాక్షన్ సీన్స్ అన్నీ అదుర్స్. ఇక శ్రీలీల విష‌యానికి వ‌స్తే ఆమె కేవలం పాటల కోసమే ఉంది.. సెకండాఫ్‌లో కనబడలేదు కూడా. రవిచంద్రన్ ఓకే.. జెనీలియా చాలా రోజుల తర్వాత మంచి పాత్రే చేయ‌డంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. వైవా హర్ష, సత్య త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ కూడా ప‌ర్వాలేద‌నిపించాడు.

టెక్నిక‌ల్ పర్ఫార్మెన్స్: సినిమాటోగ్రఫీ (సెంథిల్ కుమార్) విజువల్స్ క్యాచీగా ఉన్నాయి. సంగీతం (దేవిశ్రీ ప్రసాద్) అదర‌గొట్టాడు. మాస్, మెలోడీ మిక్స్‌తో ఆకట్టుకునే ట్యూన్స్ క్రియేట్ చేశాడు దేవి. సినిమా కాస్త గాడి త‌ప్పిన ప్ర‌తిసారి కూడా తన పాటలతో జోష్ పుట్టించారు. రూరల్ ఎన్విరాన్‌మెంట్, కార్పోరేట్ ఆఫీస్, కాలేజీ వాతావరణం ఇలా ప్రతీది అవినాష్ కోల్లా చక్కగా డిజైన్ చేశారు. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయి. ద‌ర్శ‌కుడు కిరీటిని బాగా చూపించే యత్నంలో కథా, కథనాలు వదిలేసిన‌ట్టుగా అనిపిస్తుంది. పరమ రొటీన్ కథను పట్టుకొని కేవలం కొన్ని మూమెంట్స్ తప్ప మిగతా కథనం అంతా బోరింగ్ అండ్ అవుట్ డేటెడ్ గానే అనిపిస్తుంటుంది.

ప్లస్ పాయింట్లు: 

  • కిరీటి డ్యాన్స్
  • సెంథిల్ కుమార్ విజువల్స్
  • దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
  • సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్లు:

కంటెంట్ లోనే లోపం
ఫస్ట్ హాఫ్ బోరింగ్
ఊహించిన విధంగా సెకండాఫ్
శ్రీలీల పాత్ర

  1. దర్శకత్వం: రాధాకృష్ణారెడ్డి
  2. నిర్మాత: రజనీ కొర్రపాటి
  3. సమర్పణ: సాయి శివానీ
  4. సినిమాటోగ్రఫి: సెంథిల్ కుమార్
  5. మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
  6. ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే
  7. ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
  8. బ్యానర్: వరాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి
  9. రిలీజ్ డేట్: 18-07-2025

Junior Movie Review | చివరగా..

‘జూనియర్’ సినిమాతో (Junior Movie) కిరీటి నటుడిగా ప‌ర్వాలేద‌నిపించాడు. ఆయన డ్యాన్స్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నా.. కథ, కథనాల పరంగా సినిమా పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో నిలవలేకపోయింది. కొద్దిపాటి ఎమోషనల్ మూమెంట్స్ తప్పితే మిగతా భాగం డల్‌గా సాగుతుంది. ఫస్టాఫ్ అంతా ఫిల్లర్.. బలవంతంగా వచ్చే కాలేజ్ ఎపిసోడ్స్, లవ్ ట్రాక్.. కొన్ని కావాల‌న్న‌ట్టే పెట్టిన పాట‌లు.. ఇంటర్వెల్ వరకు ఇలాగే లాక్కొచ్చాడు దర్శకుడు రాధాకృష్ణా రెడ్డి. సెకండాఫ్‌లో మెయిన్ ప్లాట్ అంతా ఓపెన్ చేయ‌డంతో థ్రిల్ మిస్ అవుతుంది. జెనీలియా, కిరీటి మధ్య సెంటిమెంట్ సీన్స్ ఇంకాస్త ఉంటే బాగుండేది. కానీ మిస్ ఫైర్ అయిన‌ట్టు అనిపిస్తుంది. రవిచంద్రన్ క్యారెక్టర్ ఇంకాస్త డెప్త్ ఉండుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది.

రేటింగ్: 2.5/5