2
అక్షరటుడే, ముప్కాల్: Balkonda MLA | మండల కేంద్రంలో నునుగొండ శ్యామల మెమోరియల్ అంతర్జిల్లా జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ టోర్నీ (Kabaddi Championship tournament) ప్రారంభమైంది. స్థానిక జీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో టోర్నీని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (MLA Prashanth Reddy) గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు యువతకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. ముఖ్యంగా క్రీడల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన ఆటగాళ్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి ఛాంపియన్‌షిప్‌లు క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్నిస్తాయని స్పష్టం చేశారు.