ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Junior Doctors | జూడాల సమ్మె విరమణ

    Junior Doctors | జూడాల సమ్మె విరమణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Junior Doctors | తెలంగాణలో జూనియర్​ డాక్టర్లు (Junior doctors) కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

    తమ సమస్యలు పరిష్కరించాలని, స్టయిఫండ్​ పెంచాలని (stipends increase) కొంతకాలంగా జూడాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి సమ్మె చేపడుతామని వారు ప్రకటించారు.

    జూడాలు సమ్మె చేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వం వారి స్టైఫండ్ (stipend)​ భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒకే సారి 15శాతం స్టైఫండ్​ పెంచుతూ జీవో జారీ చేసింది. మెడికల్ (Medical), డెంటల్ (Dental) స్టూడెంట్స్‌తో పాటు.. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం కూడా పెంచింది. అనంతరం జూనియర్​ డాక్టర్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాతో సమావేశమయ్యారు. చర్చలు సఫలం కావడంతో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. స్టైఫండ్​ పెంచడంతో రేపు తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు జూనియర్​ డాక్టర్లు తెలిపారు.

    More like this

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవలి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని...

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ.. గొర్ల కాపరితో సహా 30 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...