అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Junior Assistant Disproportionate Assets | ఓ జూనియర్ అసిస్టెంట్ ఆస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ (Rajasthan)లో చోటు చేసుకుంది.
రాజస్థాన్‌లోని ఏసీబీ (ACB) అధికారులు ఇటీవల ఫలోడి జిల్లాలోని గ్రామ పంచాయతీ ఉడత్లో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శుభకరణ్ పరిహార్ (చిపా) ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో అతడి ఇంట్లో భారీగా ఆస్తులు గుర్తించారు. శుభకరణ్ తన పదవిని దుర్వినియోగం చేయడం ద్వారా అక్రమ మార్గాల ద్వారా కోట్లాది రూపాయలు కూడబెట్టాడని ఆరోపిస్తూ ఫిర్యాదులు అందాయి. దీంతో తనిఖీలు చేసినట్లు ACB డైరెక్టర్ జనరల్ గోవింద్ గుప్తా పేర్కొన్నారు.
Junior Assistant Disproportionate Assets | రూ.75 లక్షల నగదు స్వాధీనం
శుభకరణ్ తన ఆదాయం కంటే 938 శాతం ఎక్కువ ఆస్తులను సంపాదించడాని అధికారులు గుర్తించారు. 5 ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. బికనీర్ (Bikaner), గంగాసహర్, పున్రసర్, ఫలోడిలోని ప్రదేశాలలో దాడులు చేపట్టారు. బికనీర్‌లోని అతడి నివాసం నుంచి సుమారు రూ.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కిలోకు పైగా బంగారం, సుమారు 2 కిలోల వెండి గుర్తించారు. సదరు జూనియర్ అసిస్టెంట్‌కు మొత్తం 4 విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. 42 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.