అక్షరటుడే, నిజాంసాగర్: Jukkal MLA | జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు(Thota Lakshmi Kantha Rao) అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్(Hyderabad)లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బిచ్కుంద మఠాధిపతి సద్గురు బసవలింగ సంస్థాన్ మఠం పీఠాధిపతి సోమయ్యప్ప స్వామి మంగళవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించారు.
Jukkal MLA | నన్ను కలవడానికి రావొద్దు: ఎమ్మెల్యే
తనను కలవడానికి ఎవరూ ఆస్పత్రి(Hospital)కి రావద్దని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నియోజవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అస్వస్థతకు గురైన తనకు వైద్యులు చికిత్స(Doctors treatment) అందిస్తున్నారని చెప్పారు. ఇతర రోగులకు ఇబ్బంది కలగకుండా ఆస్పత్రి యాజమాన్యం సందర్శకులను అనుమతించడం లేదన్నారు. త్వరలోనే కొలుకొని ప్రజల మధ్యకు వస్తానని చెప్పారు.