6
అక్షరటుడే, ఇందూరు: Sarangapur | నిజామాబాద్ రూరల్ పరిధిలోని సారంగాపూర్ ఉన్నత పాఠశాలను సోమవారం డీఎస్ఎల్ఏ సెక్రెటరీ (DSLA Secretary), సీనియర్ సివిల్ జడ్జి (Senior Civil Judge) ఉదయ భాస్కరరావు పరిశీలించారు. పాఠశాలలో 220 మంది విద్యార్థులు, 14 మంది ఉపాధ్యాయులకు కలిపి ఒకే టాయిలెట్ ఉందని మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో మానవ హక్కుల కమిషన్ (Human Rights Commission) సమస్యను సుమోటోగా స్వీకరించింది. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy) పూర్తి నివేదిక పంపాలని కోరారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి, డీఈవో అశోక్ (DEO Ashok) సందర్శించారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.