Homeతాజావార్తలు Jubilee Hills Counting | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. కౌంటింగ్ ప్రారంభానికి ముందు పోటీ చేసిన...

 Jubilee Hills Counting | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. కౌంటింగ్ ప్రారంభానికి ముందు పోటీ చేసిన అభ్య‌ర్థి మృతి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసిన అభ్యర్ధి మహమ్మద్‌ అన్వర్‌ గుండెపోటుతో చనిపోయారు. NCP నుంచి బరిలోకి దిగిన మహమ్మద్‌ అన్వర్‌ .. ఓట్ల లెక్కింపుకి కొద్ది నిమిషాల ముందు చనిపోవ‌డం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills Counting | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభించ‌డానికి కొద్ది స‌మ‌యం ముంద విషాదం నెలకొంది. ఈ ఎన్నికల్లో NCP తరఫున పోటీ చేసిన అభ్యర్థి మహమ్మద్‌ అన్వర్ (Mohammed Anwar) గుండెపోటుతో మృతి చెందారు.

కౌంటింగ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందే ఆయన మరణించడం కుటుంబ సభ్యులతో పాటు NCP శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో (Jubilee Hills by-Election) భాగంగా ముందుగా బ్యాలెట్ పేపర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం హైదరాబాద్‌లోని (Hyderabad) కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఫోర్సులతో పాటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల నుంచి మొత్తం 700 మంది పోలీసులు నియమించారు. స్టేడియం లోపల, బయట మూడు స్థాయిల భద్రత అమల్లో ఉంది.

Jubilee Hills Counting | తీవ్ర విషాదం..

పోలీసు ఉన్నతాధికారులు స్టేడియం పరిసర ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్టేడియం చుట్టూ 100 మీటర్ల పరిధిలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అలాగే ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు కొనసాగుతోంది. ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి ర్యాలీలు, సెలబ్రేషన్స్‌కు అనుమతి ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. ఉప ఎన్నిక ఫలితాలతో పాటు అభ్యర్థి అన్వర్ మరణ వార్త జూబ్లీహిల్స్‌లో విషాద వాతావరణాన్ని సృష్టించింది.

కౌంటింగ్ ప్రక్రియ కోసం మొత్తం 407 పోలింగ్ స్టేషన్లకు గాను 42 టేబుళ్లు TAbles ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో లెక్కింపు నిర్వహించనున్నారు. ప్రతి టేబుల్‌ వద్ద ముగ్గురు అధికారులు లెక్కింపులో పాల్గొంటారు. ప్రతి రౌండ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ఈసీ (Election Commission) అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేస్తారు. కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీస్, CISF, స్పెషల్ బ్రాంచ్ బలగాలు విస్తృతంగా మోహరించబడ్డాయి. అనుమానితులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఇక పోస్టల్ బ్యాలెట్‌ల విషయానికి వస్తే, బుధవారం సాయంత్రం వరకు ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా రాలేదు. అందువల్ల ముందుగా హోం ఓటింగ్ ఓట్ల లెక్కింపునే ప్రారంభించనున్నారు. హోం ఓటింగ్ కోసం 103 మంది దరఖాస్తు చేయగా, అందులో 101 మంది ఓటు వేశారు. ఇద్దరు ఓటర్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. హోం ఓటింగ్ తర్వాత షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. చివరిగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది.

Must Read
Related News