అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
ఎన్నికల సంఘం (Election Commission) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 13న నోటిఫికేషన్ వెలువడనుంది. 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. కాగా జూబ్లీహిల్స్ ఎన్నికలపై మంత్రి పొన్నం ఢిల్లీ (Delhi)లో మాట్లాడారు. రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.
Jubilee Hills | బీసీకే టికెట్
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ వంద శాతం బీసీలకు ఇస్తారని తాను భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ముగ్గురి పేర్లను హైకమాండ్‌కు పంపించారు. నవీన్‌యాదవ్, బొంతు రామ్మోహన్ సీఎన్‌రెడ్డి పేర్లను అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. బీసీలకు టికెట్ ఇస్తే నవీన్‌యాదవ్, బొంతు రామ్మోహన్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. కాగా దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.
Jubilee Hills | కాంగ్రెస్‌దే గెలుపు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు విజ్ఞతతో ఓటు వేస్తారని ఆయన పేర్కొన్నారు. కంటోన్మెంట్ (Cantonment) ఉప ఎన్నికల్లో గెలిచినట్లు జూబ్లీహిల్స్‌లో గెలుస్తామన్నారు. సానుభూతి పేరిట మాగంటి గోపినాథ్ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులను ఆయన విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజలు పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యారన్నారు. దీంతో అక్కడి ప్రజలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.