Homeతాజావార్తలుJubilee Hills by-Election | కాంగ్రెస్​తోనే జూబ్లీహిల్స్​ అభివృద్ధి : మంత్రి పొన్నం ప్రభాకర్​

Jubilee Hills by-Election | కాంగ్రెస్​తోనే జూబ్లీహిల్స్​ అభివృద్ధి : మంత్రి పొన్నం ప్రభాకర్​

జూబ్లీహిల్స్​లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ కోరారు. కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​యాదవ్​ను గెలిపించాలన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills by-Election | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక (Jubilee Hills by-Election) సమీపిస్తోంది. దీంతో గెలుపు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్​ (Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ.. కాంగ్రెస్​తోనే జూబ్లీహిల్స్​ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అన్నారు.

జూబ్లీహిల్స్​ నియోజకవర్గం (Jubilee Hills Constituency)లో ప్రతి ఎన్నికల్లో ఓటింగ్​ తక్కువగా నమోదు అవుతోంది. 50 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో పొన్నం ఓ వీడియో విడుదల చేశారు. ప్రతి ఓటరు తమ ఓటింగ్​లో పాల్గొనాలని కోరారు. ఈ నెల 11న పోలింగ్​ సందర్భంగా నియోజకవర్గంలో సెలవు ఉంటుందని, ప్రజలు ఓటు వేయాలన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్​ (Congress)ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృధి సాధ్యమన్నారు. గతంలో కంటోన్మెంట్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలిచిందని, ప్రస్తుతం సైతం విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక యువకుడు, విద్యా వంతుడైన తమ అభ్యర్థి నవీన్​యాదవ్​కు ఓటు వేయాలని ఆయన కోరారు.

Jubilee Hills by-Election | భారీ మెజారిటీతో గెలుస్తాం

కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ జోరుగా ప్రచారం చేస్తున్నారు. శనివారం ఆయన పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల మీద నమ్మకముందని, భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు చెప్పారు. తన మీద ప్రతిపక్షాల ఆరోపణలు పని చేయవన్నారు. జనాలకు అన్నీ తెలుసు.. మోసపోయే పరిస్థితిలో లేరు అని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో నాలుగు లక్షల ఓటర్లు ఉన్నారన్నారు. అయితే లక్ష మంది ఓటర్లు దొరకడం లేదన్నారు. కాగా ఆదివారంతో ప్రచారం ముగియనుంది. అన్ని కాలనీల్లో ప్రచారం పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

Must Read
Related News