అక్షరటుడే, హైదరాబాద్: Jubilee Hills Congress : గల్లీ నుంచి ఢిల్లీ(Delhi) దాకా.. అన్నట్లు కాంగ్రెస్ పార్టీ (Congress party)లో ఏ స్థాయిలో చూసినా వర్గపోరు ఉంటోంది. ఒక్కోసారి తారాస్థాయికి చేరుకుని శృతి మించుతోంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేదాకా వెళ్తోంది.
తాజాగా మరోసారి ఆ పార్టీ వర్గపోరుతో అప్రతిష్ట పాలైంది. జూబ్లీహిల్స్ (Jubilee Hills) పరిధి కాంగ్రెస్ నేతల్లో వర్గపోరు బహిర్గతం అయింది. ఇక్కడి కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశంలో మంత్రుల ఎదుటే కాంగ్రెస్ నాయకులు (Congress leaders) కయ్యానికి కాలు దువ్వారు.
కోడిగుడ్లు, టొమాటోలతో కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు కొట్టుకున్నారు. సమావేశాన్ని రచ్చ రచ్చ చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ఎదుటే రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డిపై దాడికి యత్నించారు.
సీఎన్ రెడ్డితోపాటు ఇతని వర్గీయులపై రహమత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి భవాని శంకర్ వర్గీయులు కోడిగుడ్లు, టమాటలు విసిరారు.
Jubilee Hills Congress : బీఆర్ఎస్ నుంచి చేరిక..
సీఎన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేశారు. కాగా, ఆయన పాత కాంగ్రెస్ నేతలను కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారనేది వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో అతనిపై దాడికి యత్నించారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ సమక్షంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర ఆందోళన ఆందోళన నెలకొంది. కార్పొరేటర్ సీఎన్ రెడ్డిని పాత కాంగ్రెస్ నేతలు సమావేశంలోకి అనుమతించలేదు.
ఈ నేపథ్యంలోనే ఇరు వర్గీయుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. అయినా అధికార పార్టీ నేతలు కావడంతో వారు కూడా ఏమీ చేయలేకపోయారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశంలో మంత్రుల ముందే కోడిగుడ్లు, టొమాటోలతో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు
మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ముందే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పై దాడికి యత్నం
కోడిగుడ్లు, టమాటలు విసిరిన రహమత్ నగర్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ భవాని శంకర్… https://t.co/S2UkHm8gMW pic.twitter.com/bPBXifL1on
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2025