HomeతెలంగాణCongress candidate Naveen Yadav | జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ఆయ‌న...

Congress candidate Naveen Yadav | జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ఆయ‌న ఎవరంటే..!

Congress candidate Naveen Yadav | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. ఏఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో నవీన్ యాదవ్ పేరు ఉంది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Congress candidate Naveen Yadav | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసింది.

ఏఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో నవీన్ యాదవ్ పేరు వెల్లడైంది. ఈ టిక్కెట్ కోసం అధికార పార్టీలో అనేక మంది ఆశావహులు పోటీ పడినప్పటికీ, పార్టీ అధిష్ఠానం చివరకు నవీన్‌కు అవకాశం కల్పించింది.

జూబ్లిహిల్స్ Jubilee Hills ఉపఎన్నిక (by-election) కు కాంగ్రెస్ పార్టీ Congress party తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. అధికారం చేపట్టిన తర్వాత జరగ‌నున్న ఈ కీలక ఉపఎన్నికలో నవీన్ యాదవ్‌కి పార్టీ టికెట్ ఇచ్చి బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకుంది.

సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి నవీన్‌ పేరు మీదే దృష్టి పెట్టగా.. కాంగ్రెస్ హైకమాండ్ కూడా అంగీకారం తెలిపింది. కాగా, నవీన్ యాదవ్ రాజకీయాలకు కొత్త కాదనే చెప్పాలి.

ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ జూబ్లిహిల్స్ ప్రాంతంలో గట్టి పట్టున్న వ్యక్తి. సినీ పరిశ్రమ నుంచి సాధారణ ప్రజల వరకు ఆయన గురించి తెలియని వారుండరన్నది వాస్తవం.

రౌడీ ఇమేజ్ ఉన్నప్పటికీ, భయంతో పాటు గౌరవాన్ని కూడా కూడగట్టుకున్న వ్యక్తిగా పేరు పొందారు. ఆయన కుమారుడిగా నవీన్‌కు బస్తీల్లోనూ, ముస్లిం వర్గాల్లోనూ పట్టు ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు.

Congress candidate Naveen Yadav | మజ్లిస్ తరఫున పోటీ చేసిన అనుభవం

నవీన్ యాదవ్ మొదట ఎంఐఎం (మజ్లిస్) తరఫున 2014లో పోటీ చేసి 9 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. 2023లో BRS, AIMIM మధ్య అవగాహన కారణంగా మజ్లిస్ టిక్కెట్ దక్కకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అప్పటి నుంచి ఆయనకు పార్టీలో “ఇన్​ఛార్జి” హోదాలో కొనసాగిస్తున్నారు. జూబ్లిహిల్స్ టిక్కెట్ కోసం కాంగ్రెస్‌లో చాలా మంది లీడర్లు ప్రయత్నించారు. మాజీ ఎంపీ అజహరుద్దీన్ ఈ టిక్కెట్ కోసం బలంగా లాబీయింగ్ చేసినా.. ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఆఫర్ చేసి మెరిట్ రేసు నుంచి తప్పించారు.

మరోవైపు అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ లాంటి సీనియర్ నేతలు కూడా ఆసక్తి చూపారు. దానం అయితే ఖైరతాబాద్ కు రాజీనామా చేసి జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేద్దామని భావించారు. కానీ, పార్టీ వారి అభ్యర్థిత్వాలను తిరస్కరించింది.

కాంగ్రెస్ పార్టీ భావన ప్రకారం.. జూబ్లిహిల్స్ నియోజకవర్గం మద్దతు సంపాదించేందుకు నవీన్ యాదవ్ మాస్ ఇమేజ్ ముఖ్యమని భావించింది. ఆయన్ని అభ్యర్థిగా ఖరారు చేయడం ద్వారా స్థానిక ఓటర్లను ఆకర్షించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ముఖ్యంగా బస్తీల ఓటర్లు, ముస్లిం వర్గాలు, యాదవ్ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్‌కు కలిసిరావచ్చు అనే లెక్కలతో నవీన్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఫైనల్ గా చెప్పాలంటే.. జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకమైనదే. ఇటువంటి తరుణంలో ప్రజల్లోకి వెళ్లే వ్యక్తిగత బలం ఉన్న అభ్యర్థిని నిలబెట్టాలనే ఉద్దేశంతో నవీన్ యాదవ్‌కి Naveen Yadav అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ పోరు మరింత రక్తి కట్టనుంది.