Homeతాజావార్తలుJubilee Hills by-poll | మహేశ్ గౌడ్, రాంచందర్ రావుకు కఠిన పరీక్ష.. పార్టీ నాయకత్వానికి...

Jubilee Hills by-poll | మహేశ్ గౌడ్, రాంచందర్ రావుకు కఠిన పరీక్ష.. పార్టీ నాయకత్వానికి పరీక్ష పెడుతున్న జూబ్లీహిల్స్ బై పోల్!

Jubilee Hills by-poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇద్దరు రాష్ట్ర నేతలకు కఠిన పరీక్ష పెడుతోంది. కింది నుంచి రాష్ట్ర సారథులుగా ఎదిగిన ఆ ఇద్దరికి బై పోల్ సవాలు విసురుతోంది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Jubilee Hills by-poll | జూబ్లీహిల్స్ Jubilee Hills ఉప ఎన్నిక ఇద్దరు రాష్ట్ర నేతలకు కఠిన పరీక్ష పెడుతోంది. కింది నుంచి రాష్ట్ర సారథులుగా ఎదిగిన ఆ ఇద్దరికి బై పోల్ సవాలు విసురుతోంది.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Congress Party state president Mahesh Kumar Goud), బీజేపీ రాష్ట్ర సారథి రాంచందర్ రావు (BJP state president Ramchandra Rao) కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంతో కీలకంగా మారింది.

అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో తమ పార్టీని విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యత ఆ ఇద్దరి నాయకులపైనే పడింది.

సంపన్నులతో పాటు పేద వర్గాలు మిళితమై ఉండే జూబ్లీహిల్స్ గడ్డపై విజయం సాధించి తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారో.. లేక సమరంలో సత్తా చాటలేక ఓటమి మూటగట్టుకుంటారో నవంబరు 14వ తేదీన తేలిపోనుంది.

Jubilee Hills by-poll | 11న బైపోల్..

జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ MLA Maganti Gopinath హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. నవంబరు 11న ఉప ఎన్నికలు, 14న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ఇటీవలే షెడ్యూల్ ప్రకటించింది.

నోటిఫికేషన్ కూడా జారీ కావడంతో ప్రధాన పార్టీలతో పాటు చాలా మంది నామినేషన్లు దాఖలు చేయగా.. బుధవారం స్క్రూటినీ నిర్వహించారు.

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ Congress candidate Naveen Yadav, బీఆర్​ఎస్ అభ్యర్థి మాగంటి సునీత BRS candidate Maganti Sunitha, బీజేపీ నుంచి లంకల ప్రదీప్​ రెడ్డి BJP candidate Lankala Pradeep Reddy నామినేషన్లకు రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారు.

విజయం కోసం హోరాహోరీగా పోరాడుతున్న మూడు పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. సత్తా చాటేందుకు మూడు పక్షాలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం అందరి దృష్టి ఇద్దరు నేతల మీదనే నెలకొని ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర సారథి మహేశ్ గౌడ్, బీజేపీ రాష్ట్ర దళపతి రాంచందర్ రావు తమ పార్టీలను ఎలా గట్టెక్కిస్తారనే దానిపైనే చర్చ జరుగుతోంది.

Jubilee Hills by-poll | మహేశ్ కు పరీక్షే..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (పీసీసీ) చీఫ్ గా నియమితులైన ఇందూరు ముద్దు బిడ్డ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంతో కీలకంగా మారింది.

అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎదుర్కొంటున్న తొలి ఎన్నిక ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో మహేశ్ గౌడ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దారుణమైన ఫలితాలు చవిచూసింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మెజార్టీ స్థానాలు సాధించిన అధికార పార్టీ.. జీహెచ్ ఎంసీ పరిధిలో మాత్రం చతికిలపడింది.

అయితే, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలుపొందిన కాంగ్రెస్.. జూబ్లీహిల్స్ లోనూ పాగా వేయడం ద్వారా నగర పరిధిలో బలం పెంచుకోవాలని యోచిస్తోంది.

అందులో భాగంగానే మహేశ్ గౌడ్ నేతృత్వంలోని అధికార పార్టీ.. తాజా ఉప ఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.

ఇక్కడ విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని చాటుకోవడంతో పాటు మహేశ్ గౌడ్ తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభించనట్లవుతుంది.

Jubilee Hills by-poll | రాంచందర్ రావుకు సవాలే..

తెలంగాణలో అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో పోరాడుతున్న బీజేపీకి కూడా జూబ్లీహిల్స్ బై పోల్ కఠిన పరీక్ష పెడుతోంది. అందులోనూ ఇటీవలే రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టిన రాంచందర్ రావు తన సత్తాను నిరూపించుకునేందుకు ఇది కీలకంగా మారింది.

మహా నగరంలో బలంగా ఉన్న కాషాయ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో షాక్ ఇచ్చాయి. ఎప్పటిలాగే గోషామహాల్​లో కాషాయ జెండా రెపరెపలాడగా.. మిగతా చోట్ల దారుణంగా ఓడిపోయింది.

అయితే, లోక్ సభ సమరంలో సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో విజయం సాధించి తన బలాన్ని మరోసారి నిరూపించుకుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కాషాయ పార్టీకి కొత్త దళపతి వచ్చారు.

ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి పార్టీ బాధ్యతలు స్వీకరించిన రాంచందర్ రావు సామర్థ్యానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరీక్ష పెడుతోంది. బీఆర్​ఎస్​కు తోక పార్టీగా మారిందన్న ప్రచారాన్ని తిప్పికొడుతూ.. ఆయన పార్టీని ఎలా విజయ తీరాలకు చేర్చుతారన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది.