అక్షరటుడే, హైదరాబాద్: Jubilee Hills by-elections | గ్రేటర్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ Jubilee Hills అసెంబ్లీ నియోజకవర్గం (assembly constituency) లో ఉప ఎన్నికల సందడి కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. కాగా, అమీర్‌పేట్ మైత్రివనం సమీపంలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఎలక్షన్ కోడ్‌కు విరుద్ధంగా నగదు తరలిస్తున్న వారిని స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్ పట్టుకుంది.
మైత్రివనం వద్ద తనిఖీలు చేపడుతున్న సమయంలో TS09FF 6111 నంబరు గల కారులో రూ. 25 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన శ్రీ జైరాం తలాసియా నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Jubilee Hills by-elections | పంజాగుట్టలోనూ..
పట్టుబడిన నగదును ఎన్నికల కమిషన్ Election Commission మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక మధురానగర్ పోలీసులకు అప్పగించారు. బై ఎలక్షన్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.
శ్రీనగర్ కాలనీలో పంజాగుట్ట పోలీసులు నిర్వహించిన తనిఖీల్లోనూ నగదు పట్టుబడింది. ఒక కారులో రూ.4 లక్షల నగదు, 9 చివాస్ రీగల్ మద్యం బాటిళ్లు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకొని, పోలీసులు కేసు నమోదు చేశారు.