Homeతాజావార్తలుJubilee Hills by-elections | జూబ్లీహిల్స్​లో భారీ భద్రత నడుమ పోలింగ్​.. మొరాయించిన ఈవీఎంలు..!

Jubilee Hills by-elections | జూబ్లీహిల్స్​లో భారీ భద్రత నడుమ పోలింగ్​.. మొరాయించిన ఈవీఎంలు..!

Jubilee Hills by-elections | జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఓటు హక్కు వినియోగించేందుకు ప్రజలు ఉత్సాహంగా వస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Jubilee Hills by-elections | జూబ్లీహిల్స్ Jubilee Hills ఉప ఎన్నిక పోలింగ్​ తాజాగా ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్​ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

చల్లని వాతావరణం ఉన్నప్పటికీ, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే, కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పోలింగ్ ప్రక్రియలో స్వల్ప అంతరాయం ఏర్పడింది.

షేక్‌పేట్ డివిజన్‌లోని బోరబండ ప్రాంతంలో పోలింగ్ బూత్ నంబర్ 30లో ఈవీఎంలు మొరాయించాయి. అలాగే శ్రీనగర్ కాలనీలోని నాగార్జున కమ్యూనిటీ హాల్‌లో పవర్ కట్ కారణంగా ఓటింగ్ కొంతసేపు నిలిచిపోయింది.

Jubilee Hills by-elections | ప్ర‌శాంతంగా పోలింగ్..

రహమత్ నగర్‌లో Rehmat Nagar కూడా పోలింగ్ బూత్‌లు 165, 166లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది.

మొత్తం 11 ప్రాంతాల్లో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఎలక్షన్ కమిషన్ అధికారులు వెంటనే స్పందించి స‌మ‌స్య ఉన్న‌ ఈవీఎంలను రీప్లేస్ చేస్తున్నారు.

మరోవైపు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడలోని నవోదయ కాలనీ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించారు. ఆమెతో పాటు కుమారుడు, కూతురు కూడా ఓటు వేశారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

ఈ ఉపఎన్నికలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్‌ నుంచి నవీన్ యాదవ్‌, బీఆర్ఎస్‌ నుంచి మాగంటి సునీత Maganti Sunitha, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి ముఖ్య పోటీదారులుగా బరిలో ఉన్నారు.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 139 ప్రాంతాల్లో 407 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎన్నికల నిర్వహణ కోసం 5 వేల మంది సిబ్బంది, భద్రతా చర్యల్లో 1,761 మంది పోలీసులు నియమించబడ్డారు.

అదనంగా 800 మంది కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ఈసారి ఎన్నికల నిర్వహణలో ప్రత్యేకంగా డ్రోన్లను ఉపయోగించడం విశేషం.

పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో చట్టవిరుద్ధ చర్యలను అరికట్టేందుకు 144 సెక్షన్ అమలులో ఉంది. మొత్తంగా, చిన్నచిన్న సాంకేతిక ఆటంకాలను మినహాయిస్తే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

Must Read
Related News