అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ పర్వం ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థలతో పాటు చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు.
మాగంటి గోపినాథ్ మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ఆయన సతీమణి సునీతను బరిలో నిలిపింది. కాంగ్రెస్ బీసీ నేత, నగరం (Hyderabad)లో పట్టు ఉన్న సామాజిక వర్గానికి చెందిన నవీన్యాదవ్ను ఎంపిక చేసింది. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు (nominations) దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తమ ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలు పొందరుపరిచారు.
Jubilee Hills by-election | కాంగ్రెస్ అభ్యర్థి ఆస్తులే ఎక్కువ
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) తన ఆస్తులు రూ.30.3 కోట్లుగా ప్రకటించారు. బ్యాచిలర్ ఆప్ ఆర్కిటెక్చర్ చదివిన ఆయనపై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. బేగంపేటలోని సీఎస్ఐఐటీలో బ్యాచిలర్ ఆప్ ఆర్కిటెక్చర్ చదివారు. ఆయన పేరు మీద మొత్తం రూ.30.3 కోట్ల ఆస్తులు ఉండగా.. చరస్తులు రూ.63,87,813, స్థిరాస్తులు రూ.29,66,39,250 ఉన్నాయి. అప్పులు రూ.75 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఆయన భార్య వర్ష యాదవ్ పేరిట రూ.8.25 కోట్లు, కుమారుడి పేరిట రూ.19.31 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయి.
Jubilee Hills by-election | దీపక్‌రెడ్డి ఆస్తులు రూ.4.48 కోట్లు
బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి (Lankala Deepak Reddy) తన పేరిట 4.48 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో చరాస్తులు రూ.37,54,624, స్థిరాస్తులు రూ. 4,10,00,000 ఉన్నాయి. అప్పులు రూ.8,14,776 ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని సెంట్ మేరి జూనియర్ కాలేజీలో ఆయన ఇంటర్ వరకు చదివారు. తనపై 5 క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన భార్యపై రూ.1.54 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
Jubilee Hills by-election | సునీత పేరిట రూ.12.29 కోట్లు
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) పేరిట రూ.12.29 కోట్ల ఆస్తులు ఉన్నాయి. రూ.4.40 కోట్ల అప్పులు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆమె పదో తరగతి వరకు మాత్రమే చదివారు. ఏపీలోకి కృష్ణా జిల్లా పెనమాలూరు జెడ్పీహెచ్ఎస్లో ఆమె టెన్త్ చదివారు. సునీత ముగ్గురు పిల్లల పేరు మీద మొత్తం రూ.12.71 కోట్ల ఆస్తులు ఉండగా.. రూ.3.15 కోట్ల అప్పులు ఉన్నాయి.