అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KCR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ ప్రచారంలో జోరు పెంచింది. ఇప్పటికే పార్టీ నేతలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సైతం రంగంలోకి దిగనున్నారు.
జూబ్లీహిల్స్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ (BRS) ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొని విజయం సాధించాలని భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తోంది. అంతేగాకుండా హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బస్తీ దవాఖానాలను మంగళవారం బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. అయితే కొంతకాలంగా ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల (Jubilee Hills Election) సందర్భంగా ప్రచారం చేపట్టనున్నట్లు తెలిసింది.
KCR | ప్రచార వ్యూహాలపై చర్చ
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో బుధవారం కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార వ్యూహాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జీలతో గురువారం కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రచార వ్యూహాలపై ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు.
KCR | ప్రచారంలో పాల్గొంటారా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెనర్ల లిస్ట్ విడుదల చేసింది. ఇందులో కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో ఆయన ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కేసీఆర్ను కేటీఆర్, హరీశ్‌రావు కోరినట్లు సమాచారం. కాగా.. కేసీఆర్ చివరగా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడారు. అనంతరం ఆయన బహిరంగ సభల్లో పాల్గొనలేదు. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఆయనతో సభ పెట్టే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.