అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-election | జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav)పై కేసు నమోదైంది. బీఆర్ఎస్ (BRS) నాయకుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరో తొమ్మిది రోజుల్లో జరగనుంది. ఈ ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలో ప్రచారంలో దూసుకు పోతున్నాయి. అయితే ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు సైతం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ క్యాడర్‌ను లేకుండా చేస్తానంటూ ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. నవీన్ యాదవ్‌తో పాటు ఆయన సోదరుడు వెంకట్ యాదవ్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు బోరబండ పీఎస్ (Borabanda Police Station)లో ఫిర్యాదు చేయడంతో మూడు కేసులు నమోదు అయ్యాయి.
Jubilee Hills by-election | బీఆర్ఎస్ అభ్యర్థిపై..
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సైతం ఇప్పటికే రెండు కేసులు నమోదు అయ్యాయి. ఓ ప్రార్థన మందిరం వద్ద ప్రచారం చేశారని సునీత, ఆమె కుమార్తె అక్షరపై పోలీసులు కేసు పెట్టారు. అలాగే బీఆర్ఎస్ గుర్తులతో ఉన్న పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారని ఇటీవల మరో కేసు నమోదైంది.
Jubilee Hills by-election | కాంగ్రెస్ ఫోకస్
ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. యూసుఫ్ గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సమావేశం నిర్వహంచారు. నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారాన్ని వేగవంతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. డివిజన్లో డోర్ టూ డోర్ ప్రచారంలో ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించాలని సూచించారు. ప్రతి 100 ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని ఏర్పాటు చేసుకొని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రులు పేర్కొన్నారు.
