అక్షరటుడే, వెబ్‌డెస్క్ : JSW IPO | సజ్జన్ జిందాల్(Sajjan Jindal) నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ (JSW Group) నుంచి మరో ఐపీవో(IPO) వస్తోంది. సిమెంట్ విభాగానికి చెందిన జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ సబ్‌స్క్రిప్షన్ గురువారం ప్రారంభం కానుంది. ఐపీవో వివరాలిలా ఉన్నాయి.
మార్కెట్‌నుంచి రూ. 3,600 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్(JSW Cement) ఐపీవోకు వస్తోంది. ఫ్రెష్ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.1,600 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా రూ. 2 వేల కోట్లు సమీకరించనున్నారు. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాజస్థాన్‌లోని నాగౌర్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ సిమెంట్ యూనిట్‌కు పాక్షికంగా ఆర్థిక సహాయం చేయడానికి రూ. 800 కోట్లను ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది. మరో రూ. 520 కోట్లు ఇప్పటికే ఉన్న రుణాలను ముందస్తుగా చెల్లించడానికి వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కేటాయించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
పబ్లిక్ ఇష్యూ(Public issue) ఆగస్టు 7న ప్రారంభమవుతుంది. 11న ముగుస్తుంది, యాంకర్ ఇన్వెస్టర్లకోసం బుధవారమే విండో ఓపెన్ అవుతుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ 12వ తేదీ రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 14న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.
ప్రైస్ బాండ్..
ఐపీవో ధర పరిధిని ఒక్కో షేరుకు రూ. 139 నుంచి రూ. 147 గా నిర్ణయించారు. ఒక లాట్(Lot)లో 102 షేర్లున్నాయి. రిటైల్ పెట్టుబడిదారులు ఐపీవో కోసం గరిష్ట ప్రైస్‌బాండ్ వద్ద కనీసం రూ. 14,994తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోటా, జీఎంపీ..
క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయించారు. జిఎంపి ఆరు రూపాయలు ఉంది. లిస్టింగ్ రోజు నాలుగు శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.