HomeతెలంగాణNTR Says sorry to Revanth | రేవంత్ రెడ్డి పేరు మ‌రిచిపోయిన జూనియ‌ర్ ఎన్టీఆర్.....

NTR Says sorry to Revanth | రేవంత్ రెడ్డి పేరు మ‌రిచిపోయిన జూనియ‌ర్ ఎన్టీఆర్.. క్ష‌మాప‌ణ‌లు చెబుతూ వీడియో రిలీజ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం వార్ 2 (War 2) రిలీజ్‌కి రెడీ అయింది. ఈ మూవీని ఆగ‌స్ట్ 14న భారీ ఎత్తున విడుద‌ల చేయ‌నుండ‌గా, గ‌త రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.

ఆగస్ట్ 10న హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్‌తో పాటు చిత్ర బృందం కూడా హాజ‌రైంది. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా స్టార్ హోస్ట్ సుమ కనకాల వ్యవహరించగా, దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇంగ్లీష్‌లో మాట్లాడిన ప్రసంగాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులోకి అనువదించ‌డం విశేషం.

NTR Says sorry to Revanth | న‌న్ను క్ష‌మించాలి..

వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్‌లతో కలిసి పని చేయడం నా అదృష్టం అని ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ అన్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్‌తో ప్రేక్ష‌కుల‌లో జోష్ మ‌రింత‌గా పెరిగింది. ఇది హిందీ సినిమా కాదు, తెలుగు సినిమా అంటూ హైప్ పెంచాడు జూనియ‌ర్. నా మొదటి సినిమా ఓపెనింగ్‌కి అమ్మా నాన్న తప్ప ఎవ్వరూ లేరు. అప్పటి నుంచి ఇవాళ వరకూ ఈ జర్నీ కొనసాగుతోంది. హృతిక్‌ డ్యాన్స్‌ను చూసి మోజుపడ్డాను. ఇండియాలోని గ్రేటెస్ట్ డ్యాన్సర్ అంటే అది హృతిక్ రోషన్ అని అన్నారు. పాతికేళ్ల క్రితం కహోనా ప్యార్ హై సినిమాలో హృతిక్ డ్యాన్స్ చూసి ఫుల్ ఫిదా అయ్యాన‌ని అన్నారు.

హృతిక్ రోష‌న్(Hrithik Roshan) ఇండియాలో గొప్ప డ్యాన్స‌ర్ అని, ఆయ‌న‌తో క‌లిసి పని చేసే ఛాన్స్ రావ‌డం నా అదృష్టం అంటూ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్. అయితే ఈవెంట్ ముగిసిన తర్వాత, తన ప్రసంగంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్ శాఖకు ధన్యవాదాలు చెప్పడం మరిచిపోయాడు ఎన్టీఆర్.

వెంటనే బాధ్యతగా స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. “ఇందాక మాట్లాడినప్పుడు ముఖ్యమైన విషయం మరిచిపోయాను. న‌న్ను క్ష‌మించాలి. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Shri Revanth Reddy)కి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Shri Mallu Bhatti Vikramarka)కి, అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్, మొత్తం తెలంగాణ పోలీస్ వ్యవస్థ(Telangana Police system)కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా పాతిక సంవత్సరాల జర్నీని అభిమానులతో పంచుకునే క్ర‌మంలో ఈ త‌ప్పిదం జ‌రిగింది అని జూనియ‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు.

https://www.instagram.com/reel/DNLkx7Xh5bV/?utm_source=ig_web_copy_link