అక్షరటుడే, వెబ్‌బెస్క్ : War – 2 Movie | యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా రూపొందిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ అంచనాలను అందుకోలేకపోయింది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం అలరించలేకపోయింది. ‘వార్ 2’(War – 2)కి తెలుగు థియేట్రికల్ హక్కులు దాదాపు ₹90 కోట్లకు అమ్ముడయ్యాయి. కానీ మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం ₹40 కోట్ల షేర్ (₹65 కోట్ల గ్రాస్) మాత్రమే రాబట్టింది. అంటే, మొత్తం రికవరీ కేవలం 45% మాత్రమే. ఇది బయ్యర్లకు సుమారు ₹50 కోట్లకు పైగా నష్టం మిగిల్చిందని ట్రేడ్ విశ్లేషణలు చెబుతున్నాయి.
War – 2 Movie | బాగా దెబ్బ కొట్టింది..
ఎన్టీఆర్ గత హిట్స్ అయిన ‘టెంపర్’ (₹50 కోట్లు షేర్), ‘రభస’ (₹35 కోట్లు షేర్) వంటి సినిమాలతో పోలిస్తే, ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి ఇంత తక్కువ వసూళ్లు రావడం ఆయన కెరీర్‌లో ఒక నెగెటివ్ మైలురాయిగా నిలిచే అవకాశముంది. మొదటి రోజు రజనీకాంత్ ‘కూలీ’ సినిమాతో పోటీపడడంతో ‘వార్ 2’ (WAR 2) కలెక్షన్లు మరింత డ్రాప్ అయ్యాయని విశ్లేషకుల అభిప్రాయం. యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) తెలుగు మార్కెట్‌ను టార్గెట్ చేసి సరైన ప్రమోషన్ చేయకపోవడం కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. ఎన్టీఆర్ విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం కూడా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. మరోవైపు ఈ సినిమాను చాలా మంది “డబ్బింగ్ సినిమా”గా భావించడం, ఇందులో ఎన్టీఆర్ (Jr.NTR) నటించినప్పటికీ, సినిమాకు తెలుగు నేటివిటీ లేకపోవడం, ప్రేక్షకులను సినిమాకు ఎమోషనల్‌గా కనెక్ట్ కాకుండా చేసింది.
విడుదల సమయానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడడంతో థియేటర్లకు జనాలు తక్కువగా రాగా, దీంతో కలెక్షన్లు మరింత తగ్గిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, తొలి ప్రయత్నమే ఫెయిల్యూర్‌గా మిగిలింది. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కేవలం రూ. 221 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 300 కోట్లు మాత్రమే క్రాస్ చేసిందని అంటున్నారు. వాస్తవానికి, ఈ స్థాయి బడ్జెట్ చిత్రాలు కనీసం రూ. 400 కోట్లు దేశీయంగా రాబట్టాలి అన్నది అంచనా. కానీ ప్రపంచ ప్తంగా కూడా ఈ సినిమా కేవలం ₹300 కోట్లు మాత్రమే దాటడం, పరిశ్రమను షాక్‌కు గురి చేస్తోంది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, మౌత్ టాక్ బలహీనంగా ఉండడంతో వసూళ్లు ఒక్కసారిగా పడిపోయినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో, అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.