అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jr. NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR) వరుస సినిమాలతో తన క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇటీవల “దేవర” సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తారక్, ఆ తరువాత “వార్ 2” సినిమాతో (War2 Movie) బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించగా, ఎన్టీఆర్ కీలక పాత్రతో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. ప్రస్తుతం ఎన్టీఆర్, “కేజీఎఫ్” (KGF), “సలార్” సినిమాలతో (Salaar Movie) బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 చివర్లో విడుదల కానుందని సమాచారం.
Jr. NTR | హెవీ వర్కవుట్స్..
ఈ ప్రాజెక్ట్‌పై (Project) ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. “కేజీఎఫ్”, “సలార్” సినిమాలకన్నా ఈ సినిమా మాస్ అండ్ యాక్షన్ లెవెల్ ఎక్కువగా ఉండబోతుందంటూ టాక్ వినిపిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ వ్యక్తిగత జిమ్ ట్రైనర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేసిన ఒక వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“దేవర నుంచి వర వరకు.. వర నుంచి విక్రమ్ వరకు.. ఇప్పుడు డ్రాగన్ కోసం,” అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఈ పోస్ట్‌లో ఎన్టీఆర్ హ్యాండ్ వర్కౌట్స్ చేస్తూ తన కండల శరీరాన్ని ప్రదర్శించాడు.”ఈ మనిషి తన డెడికేషన్‌తో నన్ను ఎప్పటికప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు,” అంటూ తారక్‌పై పొగడ్తల జల్లు కురిపించాడు ట్రైనర్.
ఈ వీడియో చూసిన అభిమానులు “నెక్స్ట్ మూవీ హిట్ పక్కా!”, “బాడీ లెవెల్ మాస్!” అంటూ రీ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికీ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు “డ్రాగన్” (Dragon) అనే టైటిల్ ఫిక్స్ అయిందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. భారీ తారాగణంతో పాన్ ఇండియా స్థాయిలో మూవీ రూపొందనుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం కానుంది. మూవీకి రవి బస్రుర్ సంగీతం అందించనున్నాడు. మలయాళ నటుడు బిజూ మీనన్, యువ నటుడు టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటుంది.
Every drop of sweat is building up for the destruction 💥💥
Man of Masses @tarak9999 pushing limits for the hysteria of #NTRNeel 🔥🔥#NTR pic.twitter.com/1Tr55smIj2
— Vamsi Kaka (@vamsikaka) September 16, 2025