అక్షరటుడే, ఇందూరు: Agricultural College | జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన వ్యవసాయ కళాశాలను మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ (Gadugu Gangadhar) ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.
ఎన్నో ఏళ్లుగా జిల్లా ప్రజలు, జిల్లా రైతాంగం వ్యవసాయ కళాశాల కోసం ఎదురుచూస్తున్నారని రైతుల పక్షపాతి అయిన సీఎం జిల్లాకు వ్యవసాయ కళాశాల (agricultural college) మంజూరు చేయడం గొప్ప విషయం అన్నారు. తాను సైతం జిల్లాకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పలుమార్లు వ్యవసాయ కళాశాల గురించి విజ్ఞప్తి చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.
జిల్లాకు వ్యవసాయ కళాశాల తేవడంలో ఆయన పాత్ర కూడా ఉందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) వ్యవసాయ కళాశాల మంజూరు చేయించడంలో విశేష కృషి చేశారన్నారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సైతం ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Agricultural College | జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరుపై కాంగ్రెస్ హర్షం
అక్షరటుడే, కమ్మర్పల్లి: జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరుపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమ్మర్ పల్లి మండల (Kammarpally Mandal) పార్టీ అధ్యక్షుడు సుంకెటరవి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు కోసం తీర్మానించడం సంతోషకరమైన విషయన్నారు. దీంతో వ్యవసాయంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుచ్చన్న, గణేష్, బుచ్చి మల్లయ్య, శ్రీనివాస్, రాజేష్, రాకేష్, పూజారి శేఖర్, శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్, నరేష్, రాజేశ్వర్, జగదీష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
