అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల (Agriculture College) మంజూరు కావడంపై తెలంగాణ విశ్వవిద్యాలయ (TU) పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పంచ రెడ్డి చరణ్ (Panchareddy Charan) హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆయన మాట్లాడారు.
జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడంలో కీలకపాత్ర పోషించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా విద్యారంగ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు గల కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ విశ్వవిద్యాలయం, మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.
మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిందని, తాజాగా వ్యవసాయ కళాశాలను జిల్లాకు మంజూరు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దత్తు, సతీశ్, రమేష్, మీరన్ అలీ, అయూబ్, విశాల్, జగన్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు