అక్షరటుడే,కోటగిరి: Pothangal | పోతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ప్రధాని మోదీ (PM Modi) చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పంటలకు మద్దతు ధర పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్) మాట్లాడుతూ.. కేంద్రం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాన్సువాడ ఓబీసీ మోర్చా (Banswada OBC Morcha) కన్వీనర్ నాగం సాయిలు, మక్కయ్య, కిరణ్ సేట్, అశోక్, శంకర్, విజయ్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.