Homeజిల్లాలుకామారెడ్డిJournalists protest | జర్నలిస్టుల నిరసన

Journalists protest | జర్నలిస్టుల నిరసన

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Journalists protest | పత్రికా సంపాదకుడిపై అక్రమ కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టులు(Journalists) ఆరోపించారు. పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తాలో నిరసన తెలిపారు. ‘సాక్షి’ ఎడిటర్​పై పోలీసులు(AP Police) అక్రమంగా కేసులు నమోదు చేశారని.. అనుమతి లేకుండానే ఆయన ఇంట్లో సోదాలు చేయడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్ గౌడ్, చంద్రశేఖర్, విలేకరులు సుధాకర్, లతీఫ్, వరప్రసాద్, అంబిర్​పూర్​ రాజు, శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, జాకిర్, సతీష్ గౌడ్, రామా గౌడ్, సుందర్ పాల్గొన్నారు.

Journalists protest | బోధన్​లో..

అక్షరటుడే, బోధన్: Journalists protest | పట్టణంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్​పై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్​ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఏపీ కూటమి ప్రభుత్వం జర్నలిస్టులపై దాడులు చేయడం సబబు కాదని పేర్కొన్నారు.